ప్రతి హీరోయిన్ కు ఓ టైమ్ వస్తుందంటారు.. మొన్నటివరకు పూజాహెగ్డే టైమ్ నడిచింది. ఆ తర్వాత రష్మిక, ఇప్పుడు శ్రీలీల.. ఇలా ఒక్కో సీజన్ లో ఒక్కో హీరోయిన్ కు క్రేజ్ వస్తుంది. అలాంటి టైమ్ ఇప్పుడు ప్రియాంక మోహన్ కు వచ్చినట్టుంది. ఈ ముద్దుగుమ్మ వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తోంది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ఓజీ సినిమాలో నటిస్తోంది ప్రియాంక మోహన్. ఈ సినిమా సెట్స్ పై ఉంది. అంతలోనే నాని సరసన 'సరిపోదా శనివారం' అనే సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. ఇప్పుడు రవితేజ మూవీలో కూడా ఆఫర్ రెడీగా ఉంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా ముందుగా రష్మికను అనుకున్నారు. కానీ రష్మిక, కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేక తప్పుకుందంట. దీంతో ఆ అవకాశం ప్రియాంక మోహన్ ను వరించింది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది.
నిన్నమొన్నటివరకు అసలు ప్రియాంక మోహన్ పేరు టాలీవుడ్ లో వినిపించలేదు. గ్యాంగ్ లీడర్, శ్రీకారం లాంటి ఫ్లాప్స్ తర్వాత ఆమె పూర్తిగా కోలీవుడ్ కు పరిమితమైంది. ఇప్పుడు ఒక్కసారిగా తెలుగులో వరుసగా పెద్ద సినిమా ఆఫర్లు అందుకుంటోంది. అదృష్టం అంటే ఇదేనేమో..!