EntertainmentLatest News

హీరోయిన్‌ కోసం రవితేజ తంటాలు!


ఎక్కువగా కమర్షియల్‌ మూవీస్‌ చేయటానికి ఇష్టపడే కథానాయకుడు మాస్‌ మహారాజ రవితేజ ఇప్పుడు తదుపరి సినిమాను గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేయటానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ మూవీలో హీరోయిన్‌ ఎవరనే విషయంపై మేకర్స్‌ ఇంకా మల్లగుల్లాలు పడుతున్నట్లు సినీ సర్కిల్స్‌ సమాచారం. నిజానికి ప్రాజెక్ట్‌ ఫైనలైజ్‌ అయినప్పుడు వినిపించిన పేరు శ్రీలీల. అయితే ఆమె చేతినిండా అవకాశాలతో ఫుల్‌ బిజీగా ఉండటం వల్ల డేట్స్‌ను కేటాయించలేనని ముందుగానే ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. తర్వాత అవకాశం శాండిల్‌ వుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న చేతికి వెళ్లింది.

క్రేజీ హీరోయిన్‌గా పాన్‌ ఇండియా రేంజ్‌ ప్రాజెక్ట్స్‌ చేస్తున్న రష్మిక మందన్న సైతం డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేనని సింపుల్‌గా నో చెప్పేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మేకర్స్‌ ఇప్పుడు చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్‌ మోహన్‌ను రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఇప్పుడేమీ ఖాళీగా లేదు. పవన్‌ కళ్యాణ్‌తో ఓజీ సహా నాని – వివేక్‌ ఆత్రేయ సినిమా సరిపోదా శనివారంలో నటిస్తుంది. ఇప్పుడు రవితేజ మూవీ ఆఫర్‌ వెళ్లింది. మరి ఈ చెన్నై సొగసరి ఏమంటుందో చూడాలి. నిజ ఘటనలు ఆధారంగా గోపీచంద్‌ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మునుపెన్నడూ చూడనంత పవర్‌ఫుల్‌గా ఆయన పాత్ర ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని సినీ సర్కిల్స్‌ సమాచారం.

ఇంతకు ముందు రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో డాన్‌ శీను, బలుపు, క్రాక్‌ చిత్రాలు బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు నాలుగో సినిమా రూపొందనుంది. నవంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 



Source link

Related posts

మాఫియా చేతుల్లోకి ప్రభాస్ కల్కి.. టికెట్ బుకింగ్ లో సరికొత్త స్కామ్ 

Oknews

రాజధాని ఫైల్స్ ఈ జెండా కి సపోర్ట్ అని ఒప్పుకున్న దర్శకుడు  

Oknews

ఎన్నికల ప్రచారానికి బాలయ్య ఆహ్వానం, షాక్ ఇచ్చిన ఎన్టీఆర్..!

Oknews

Leave a Comment