నేటితరం టాలీవుడ్ కమెడియన్స్‌తో అభినవ్ గోమటంకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అతనిపై నటి కల్పికా గణేష్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనతో అసభ్యంగా మాట్లాడాడని, తప్పుగా ప్రవర్తించాడని ఆరోపించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత అక్క పాత్రలో నటించిన కల్పికా గణేష్ ఊహించని విధంగా అభినవ్ గోమటంపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ విషయం పోలీసుల ఎంట్రీ ఇచ్చే వరకు వెళ్లింది. అయితే అప్పట్లో కల్పిక చేసిన ఆరోపణలపై అభినవ్ స్పందించలేదు. కానీ, రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తనపై కల్పిక చేసిన కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యాడు.
‘కల్పికతో నాకు పెద్దగా పరిచయం లేదు. అరు నెలలకో, ఏడాదికో ఓసారి ఆమెతో చాట్ చేసేవాడిని. గత ఏడాది నవంబర్‌లో తనకు నారీ శక్తి అవార్డ్ వచ్చినట్లు కల్పికా గణేష్ నాకు మెసేజ్ పెట్టింది. ఆ అవార్డ్ గురించి నేను ఎప్పుడూ వినలేదు. కానీ, నీకు ఆ అవార్డ్ రావటం ఎంతో ఆనందంగా ఉంది అంటూ అభినందనలు తెలిపాను. నేను ఓ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని అనుకుంటూ బదులిచ్చాను. కానీ, ఆ అవార్డ్ గురించి నువ్వు వినలేదా? అంటూ ఆమె గొడవకు దిగింది. పురుషాహంకారిని అని అంది. అంతే కాకుండా నీకు అంత చులకనా? నీకు ఇగో అంటూ అగ్లీ ఫైట్ చేసింది. దాంతో నేను ఆమె మెసేజ్‌లకు రిప్లై ఇవ్వటం మానేశాను. తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను పరిశీలిస్తే అందరితోనూ ఆమె అలాగే గొడవపడుతుంది.
అవార్డు గురించి తెలియదని చెప్పిన దానికి ఆ చాట్‌ను స్క్రీన్ షాట్ తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ అవార్డ్ గురించి తెలియదని చెప్పినందుకు నేను చచ్చిపోవాలంటూ మెసేజ్‌లు కూడా పెట్టింది. అయితే అవార్డ్ తెలియదని చెప్పటంలో తప్పేముందని చాలా మంది నెటిజన్స్ ఆమెకు రిప్లయ్ ఇచ్చారు. మా మధ్య జరిగిందిదే. లవ్వు గివ్వు లేదు. నేను ప్రేమ కావ్యాలేం రాయలేదు’ అంటూ కల్పిక చేసిన ఆరోపణలకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు అభినవ్.