అసలు గోరంట్ల మాధవ్ ఏమన్నారంటే?
వైసీపీ నేతలు సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం శింగనమలలో బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్… నాలుగున్నరేళ్లలో వైసీపీ చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అనంతరం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతారని, చంద్రబాబు చస్తారు. ఇది గ్యారెంటీ అని గోరంట్ల అన్నారు. ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే… పంచాయతీ నుంచి మండలాలు, జడ్పీ, మంత్రి వర్గం, డిప్యూటీ సీఎంల వరకూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్ దన్నారు.