Latest NewsTelangana

IT Employees Flocked To Gachibowli To Thank Chandrababu


హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులోని గచ్చిబౌలి మైదానంలో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం బాలయోగి స్టేడియంలో కొద్దిసేపటి క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది. ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు మద్దతుదారులు, టీడీపీ అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. 

ఈ కార్యక్రమం ప్రారంభంలో చంద్రబాబుపై స్పెషల్ వీడియో ప్రదర్శించారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనూప్‌ రూబెన్స్‌ టీమ్‌ ఆధ్వర్యంలో సంగీత విభావరి జరుగుతోంది. సైబర్‌ టవర్స్‌ నిర్మాణం, ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక వీడియో విడుదల చేశారు. చంద్రబాబు అభిమానులతో గచ్చిబౌలి మైదానం నిండిపోయింది. సెల్‌ఫోన్ల లైటింగ్‌తో చంద్రబాబుకు ఐటీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. చంద్రబాబు ముందు చూపు వల్లే ఐటీ టవర్స్ ఇంతగా అభివృద్ధి చెందాయని తెలిపారు. 

ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్ బృందం ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ, హాజరయ్యారు. బోయపాటి శ్రీను, బండ్ల గణేష్,  నందమూరి కుటుంబ సభ్యులకు పాటు ఐటీ ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబును జైల్లో పెట్టడానికి గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రసంగం మధ్యలో చంద్రబాబు అరెస్టును గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. యువతకు భవిష్యత్తును ఇచ్చినందుకు జైల్లో పెడతారా? అని ప్రశ్నించారు. 

చంద్రబాబు కోసం చచ్చిపోతానంటూ, తన ఆయుష్షును చంద్రబాబుకు ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నానని చెప్పారు. చంద్రబాబు దేవుడని తెలుగువారిగా పుట్టడం నేరమా? అని ప్రశ్నించారు. తమిళనాడులో చంద్రబాబు పుట్టుంటే ఇలా జరిగేదా? పని బండ్ల గణేష్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు కాదని, అది ఒక బ్రాండ్ అని ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు నిజాయితీపరుడని ఆయన ఏ తప్పు చేయలేదని వెల్లడించారు. ఇటీవల తాను లోకేష్ ను రెండుసార్లు కలిసానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.  

చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉంటారని దర్శకులు బోయపాటి శ్రీను వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు బోయపాటి శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘బాబు బయటకి రావాలి, అధికారం లోకి రావాలని న్యాయ పోరాటం చేస్తున్న వారికి కృతజ్ఞతలు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రపంచంలో తలెత్తుక్కొని తిరిగేలా చేశాడు. చంద్రబాబుకు అండగా నిలిచిన ఉద్యోగులకు నా కృతజ్ఞతలు. త్వరలోనే చంద్రబాబు బయటికి వస్తారు, న్యాయాన్ని గెలిపించుకొని వస్తారు. ఐయామ్ విత్ యూ బాబు’’ అని బోయపాటి శ్రీనుపేర్కొన్నారు.

నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ భార్య వసుంధరాదేవి, గారపాటి లోకేశ్వరి, వైసీపీ ఎంపీ రఘురామ కృష్టమ రాజు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్, ఏబీ వెంకటేశ్వరరావు బండ్ల గణేష్‌, బీఆర్ఎస్ పార్టీ శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బోయపాటి శ్రీనివాస్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.



Source link

Related posts

రాయన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రెండో అతి పెద్ద మూవీగా రికార్డు

Oknews

బిగ్ షాక్.. ప్రముఖ నటి పూనమ్ పాండే కన్నుమూత..!

Oknews

Viral Fevers : ఆదిలాబాద్‌ను వణికిస్తున్న డెంగీ జ్వరాలు

Oknews

Leave a Comment