Elephant Roams Railway Station : అడవుల్లో ఆహారం, నీటి వసతి కరవుతో వన్య మృగాలు ఊర్లలోకి వస్తున్నాయి. ఇటీవల తరచూ ఈ ఘటనలు చూస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చిరుతలు, ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏనుగుల సంచారం అధికంగా ఉంటుంది. ఏనుగులు తరచూ గ్రామాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉండడంతో… ఏనుగుల సంఖ్య భారీగా ఉంటుంది. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడువుల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఏనుగులు తరచూ అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాలపైకి దండెత్తుతుంటాయి. పంటలు నాశనం చేయడంతో పాటు ప్రజలపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి.