World Cup 2023: ఇంగ్లండ్‌ను ఓడించిన భారత జట్టు మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో టోర్నీలో జోస్ బట్లర్ నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రయాణం దాదాపుగా ముగిసింది. ఇంగ్లండ్‌పై టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్‌లోనూ, ఇంగ్లండ్ చివరి స్థానంలోనూ ఉంది.
ఈ విజయం తర్వాత భారత్ దగ్గర 12 పాయింట్లు ఉన్నాయి. 2023 ప్రపంచ కప్‌లో భారత జట్టు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. భారత్ ఆరు మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకుంది. దక్షిణాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది.
ఇంగ్లండ్‌లో పరిస్థితి మరింత కిందకి…
ఇంగ్లండ్ తమ ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ చివరి స్థానంలో అంటే పదో స్థానంలో ఉంది. ఈ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిని చవి చూడగా, కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది.
దక్షిణాఫ్రికా ఆరు మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో టెంబా బవుమా జట్టు రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ఆరు మ్యాచ్‌ల్లో ఎనిమిది పాయింట్లు సాధించింది. దీని తర్వాత పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. ఆస్ట్రేలియా 6 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లు సాధించింది.
పాయింట్ల పట్టికలో ఇతర జట్లు ఎక్కడ ఉన్నాయి?
శ్రీలంకతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆరేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే మెరుగైన నెట్ రేట్ కారణంగా శ్రీలంక జట్టు ఐదో స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. నెదర్లాండ్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ 6 మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించింది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లు రెండేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. షకీబ్ అల్ హసన్ జట్టు మెరుగైన నెట్ రన్ రేట్‌తో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ జట్టు పదో స్థానంలో ఉంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial