ByGanesh
Sun 29th Oct 2023 04:56 PM
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం న్యూజిలాండ్ వెళ్లారు. అక్కడ తన టీమ్ తో కన్నప్ప మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో మంచు విష్ణు కి గాయాలయ్యాయి. షూటింగ్ చేస్తున్నప్పుడు డ్రోన్ వచ్చి చేతిమీద పడడంతో ఆయనకి గాయాలు అవడంతో.. షూటింగ్ నిలిపివేశారు. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో మంచు విష్ణు కి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో డ్రోన్ కెమెరా మంచు విష్ణు మీదికి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది.
విష్ణు చేతులతో పాటు శరీరంపై మరికొన్ని చోట్ల గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే చిత్రబృందం విష్ణు కి చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకి చికిత్స అందించి కొద్దిపాటి రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ఈ ప్రమాదంతో దర్శకుడు కన్నప్ప సినిమా షూటింగ్ నిలిపి వేసినట్లు తెలుస్తోంది. విష్ణు కి ప్రమాదంలో గాయాలయ్యాయని విషయం తెలియడంతో మంచు విష్ణు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.
మంచు విష్ణు.. మంచు మోహన్ బాబు, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ ఇలా భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో కన్నప్ప మూవీని నిర్మిస్తున్నాడు.
Manchu Vishnu meets with an on-set accident:
Manchu Vishnu Met With An Accident While Shooting Kannappa