EntertainmentLatest News

30 ఏళ్ళ తర్వాత రెండు ఇంటర్వెల్ లతో సినిమా


 

అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో టోటల్ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన దర్శకత్వం వహించిన యానిమల్ అనే హిందీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1 న విడుదల కాబోతుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సంచలనం సృష్టిస్తుంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అండ్ సౌత్ ఇండియన్ ముద్దుగుమ్మ రష్మిక హీరో హీరోయిన్లు గా నటిస్తున్న యానిమల్ మూవీ  సినిమా నిడివి 3 గంటల 30 నిముషాలు కి సందీప్ లాక్ చేసాడని అంతే నిడివితో మూవీ కాపీని సెన్సార్ కి పంపించాడని బాలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది. సందీప్ అంత లెంత్ తో కాపీ పంపించడానికి రణబీర్ మద్దతు కూడా  ఉందని  అంటున్నారు. సందీప్ మీద రణబీర్ పూర్తి నమ్మకంతో ఉన్నాడని దీంతో ప్రొడ్యూసర్ లు కూడా నిడివి విషయం లో  రాజీపడ్డారని అంటున్నారు. అంటే ఇప్పుడు యానిమల్ సినిమా రెండు ఇంటర్వెల్ లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాకపోతే అధికారికంగా చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడి చెయ్యలేదు. గతంలో అమీర్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ లు నటించిన లగాన్, హమ్ ఆప్కె హై కౌన్ సినిమాలు కూడా డబుల్ ఇంటర్వెల్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి 

 సందీప్ తన డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డిని కూడా  మొదట నాలుగు గంటలకు పైగానే ప్లాన్ చేసుకున్నాడు. కానీ కొత్త హీరోతో అంత సుదీర్ఘమైన నిడివి అంటే థియేటర్ వర్గాల నుంచి మద్దతు దక్కదనే అనుమానంతో అర్జున్ రెడ్డి మూవీని గంటకు పైగానే ఎడిట్ చేయించి విడుదల చేసాడు .కానీ ఇప్పుడు 3 గంటల 30 నిమిషాల నిడివితో  సందీప్ యానిమల్ ని  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. యానిమల్ చిత్రం మీద భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 

 



Source link

Related posts

అమ్మ బాబోయ్.. ఇది ప్రభాస్ బొమ్మనా!

Oknews

Nara Lokesh is very strong.. లోకేష్‌ను ఎదుర్కోవడానికి ఇంకెంత మంది?

Oknews

మంచు విష్ణు  కన్నప్పలో అక్షయ్ కుమార్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్   

Oknews

Leave a Comment