EntertainmentLatest News

డిసెంబర్ 1న సడెన్ ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య!


అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన గత రెండు చిత్రాలు ‘థ్యాంక్యూ’, ‘కస్టడీ’ నిరాశపరిచాయి. దీంతో ఓ మంచి విజయంతో హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు చైతన్య. ప్రస్తుతం తన 23వ సినిమాని చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా కంటే ముందే ఈ ఏడాదిలోనే చైతన్య ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే అది సినిమా కాదు.. వెబ్ సిరీస్.

గతేడాది ‘దూత’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్లు చైతన్య ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ గురించి కొంతకాలంగా ఎలాంటి అప్డేట్స్ లేవు. అయితే సడెన్ గా ఇప్పుడు ఈ సిరీస్ స్ట్రీమింగ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందట. మొత్తం 8 ఎపిసోడ్ లు ఉంటాయని, ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నిమషాల వంతున ఉంటుందని సమాచారం.

చైతన్య, విక్రమ్ కాంబినేషన్ లో గతంలో ‘మనం’, ‘థ్యాంక్యూ’ సినిమాలు వచ్చాయి. అందులో మనం ఘన విజయం సాధించగా, థ్యాంక్యూ పరాజయం పాలైంది. మరి ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న సిరీస్ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.



Source link

Related posts

Jagan decided to hit the elephant Kumbhasthal ముగ్గురిని ఓడించేందుకు మరో ముగ్గురు!

Oknews

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Oknews

హీరోని కుక్కతో పోల్చిన దర్శక నిర్మాత 

Oknews

Leave a Comment