Top Stories

చంద్రబాబు బెయిల్.. విడుదల.. కండీషన్లు!


స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాలతో చంద్రబాబు బెయిల్ కోరారు. విచారించిన హైకోర్టు 4 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు కోర్టు వాయిదా వేసింది. 53 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆయ‌ను జైలు నుండి బ‌య‌ట‌కు రానున్నారు.

బెయిల్‌ విచ‌ర‌ణ‌ సందర్బంగా హైకోర్టు చంద్రబాబుకు పలు కండీషన్లు పెట్టింది. స్వేచ్చగా తన ఇంట్లో ఉండవచ్చని, చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లవచ్చని తెలిపింది. రాజకీయ సమావేశాల్లో కానీ, నేతలతో భేటీలో కానీ పాల్గొనవద్దని తెలిపింది. బాబు వెంట ఇద్దరు డీఎస్పీలను ఉంచాలని, అతనికి ఉన్న జడ్ ప్లస్ భద్రతను యధావిధిగా కొనసాగించవచ్చని కోర్టు తెలిపింది. చికిత్స అనంత‌రం నవంబ‌ర్ 28న సా. 5 గంట‌ల్లోపు జైలులో స‌రెండ‌ర్ కావ‌ల‌ని కోర్టు అదేశించింది.

కాగా చంద్రబాబు విడుదలకు సంబంధించిన పేపర్ వర్క్ అంతా నేడు మధ్యాహ్నాం 3 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు జైలు నుంచి ఇవాళ‌ సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది.



Source link

Related posts

అమ్మ, అమ్మమ్మల కాలం నాటి గ్లామర్ టిప్స్ నావి

Oknews

ఊహూ.. బాబుకు ద‌క్క‌ని ఊర‌ట‌!

Oknews

గెలుపా? కులమా? ఏది ముఖ్యం!

Oknews

Leave a Comment