GossipsLatest News

Mega Family from the wedding ceremony of Varun Teja-Lavanya మెగా హీరోల మధ్యలో కొత్త జంట



Thu 02nd Nov 2023 08:50 AM

varun teja,lavanya tripath  మెగా హీరోల మధ్యలో కొత్త జంట


Mega Family from the wedding ceremony of Varun Teja-Lavanya మెగా హీరోల మధ్యలో కొత్త జంట

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటలీ వేదికగా పుట్టిన ప్రేమకి.. అక్కడే ఇటలీలోనే పెళ్లితో ఆ బంధాన్ని మరింత పదిలం చేసుకున్నారు. నిన్న బుధవారం రాత్రి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. మెగా ఫ్యామిలీ తో పాటుగా అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంభ సభ్యులు, ఇంకా కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల మధ్యన వరుణ్ తేజ్-లావణ్య ల వివాహం గ్రాండ్ గా జరిగిపోయింది.

అక్కడ పెళ్లి తంతు పూర్తి కాగానే నాగబాబు కొడుకు-కోడలు పెళ్లి తర్వాత అదే దుస్తుల్లో ఉన్న పెళ్లి ఫోటోని షేర్ చేసారు. ఇక మెగాస్టార్ చిరు ఈ రోజు గురువారం ఉదయం మెగా హీరోల మధ్యలో కొత్త జంట అనేలా మరో పిక్ షేర్ చేసారు. ఆ ఫ్రేమ్ లో మెగా హీరోలంతా ఉన్నారు. వైష్ణవ తేజ్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరు, అల్లు అర్జున్, సాయి ధరమ్, అల్లు శిరీష్, నాగబాబు.. వీరంతా నించుని ఫొటోలకి ఫోజులివ్వగా.. వరుడు వరుణ్ తేజ్ వధువు లావణ్య త్రిపాఠిలు కూర్చుని ఫొటోలకి ఫోజులిచ్చారు. 

మెగా హీరోలంతా లైట్ కలర్ థీమ్ లో కనిపించగా.. లావణ్య రెడ్ కలర్ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ మెగా హీరో పెళ్ళిలో మెగా పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


Mega Family from the wedding ceremony of Varun Teja-Lavanya :

Mega Family from the wedding ceremony of Varun Teja-Lavanya Tripathi from Italy









Source link

Related posts

KCR : కాంగ్రెస్‌పై మొదటి సమరం – నల్లగొండలో 13న బీఆర్ఎస్ భారీ బహిరంగసభ !

Oknews

ప్రాజెక్టులపై కాంగ్రెస్ తీర్మానం BRS విజయం.!

Oknews

Priyanka Mohan ultra stylish look గ్లామర్ బాట పట్టిన పవన్ హీరోయిన్

Oknews

Leave a Comment