Entertainment

ముద్దు సీన్స్‌లో నటించేటపుడు నా ఫీలింగ్స్‌ అలా ఉంటాయి : అంజలి


సినిమా అంటే వినోదం.. అందులో కనిపించే సన్నివేశాలన్నీ నిజం కాదు, అంతా నటనే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ,  ఆ సన్నివేశం అక్కడ నిజంగా జరుగుతోందా అనిపించేలా నటీనటులు పెర్‌ఫార్మ్‌ చేసినపుడే ఆ సీన్‌ పండుతుంది. మిగతా సీన్స్‌ ఎలా ఉన్నా ప్రేమ సన్నివేశాల్లో హీరో, హీరోయిన్‌ ఎంత లీనమైతే ఆ సీన్‌ అంత బాగా వస్తుంది. ముఖ్యంగా ముద్దు సీన్స్‌లో నటించేటపుడు హీరో, హీరోయిన్‌ల మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ టైమ్‌లో వాళ్ళు ఏం ఆలోచిస్తారు? అలాంటి సన్నివేశం చెయ్యాల్సి వచ్చినపుడు వారి ఫీలింగ్స్‌ ఏమిటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని అందరికీ వుంటుంది. అప్పుడప్పుడు కొందరు హీరోయిన్లు ఈ విషయాలపై స్పందిస్తుంటారు. 

తాజాగా హీరోయిన్‌ అంజలి ముద్దు సీన్లు, బెడ్‌రూమ్‌ సీన్స్‌ గురించి తన ఫీలింగ్‌ని తెలియజేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సన్నివేశాల ప్రస్తావన వచ్చినపుడు ‘ముద్దు సీన్స్‌ కానివ్వండి, ఇంటిమేట్‌ సన్నివేశాలు కానివ్వండి.. అవి చేసేటపుడు నా కోఆర్టిస్ట్‌ ఏమనుకుంటాడోనన్న టెన్షన్‌ ఉంటుంది. ఇంటిమేట్‌ సీన్స్‌ సినిమాకి అవసరం అనుకున్నప్పుడు వాటిని అవాయిడ్‌ చెయ్యలేము. సౌకర్యంగా లేకపోయినా ఆ సీన్స్‌లో నటిస్తాను. అయితే అది ఎంత బాగా చేసినా సహజంగా మాత్రం ఉండదు. నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీ సినిమాలోని ప్రేమికుల మధ్య కనిపించదు. అందుకే ముద్దు సీన్స్‌లో నటించేటపుడు చాలా ఇబ్బంది ఫీల్‌ అవుతాను. అయితే ఆ సీన్స్‌కి నేను వ్యతిరేకం కాదు. కథకు అవసరం అని దర్శకుడు చెబితే చెయ్యడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఆ సన్నివేశాలు చేసేటపుడు నా ఫీలింగ్స్‌ ఎలా ఉంటాయనేది మీతో షేర్‌ చేసుకున్నాను. అంతే’ అని అంటోంది అంజలి. 



Source link

Related posts

తలైవా ఆశీస్సులు అందుకున్న లారెన్స్!

Oknews

హీరోలూ.. నిర్మాతలూ.. ఇకనైనా మారండి!

Oknews

రంభ కూతురుని చూసారా..తల్లిని మించిన అందం ఆమె సొంతం 

Oknews

Leave a Comment