రాజీ పడే ప్రసక్తే లేదు: కొండా సురేఖమేడారం పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అడగగానే నిధులు ఇస్తున్నారని, పనుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకు వంద శాతం పనులు పూర్తి కావాలని, కాంట్రాక్టర్లు, అధికారులు రాజీపడకుండా పని చేయాలన్నారు. నాణ్యత లేని పనులు చేస్తే విచారణ జరిపి సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. జాతర ఏర్పాట్లలో శాశ్వత నిర్మాణాలు చేస్తున్నామని, ఇద్దరు తల్లుల జాతరకు, ఇద్దరం మహిళా మంత్రులుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అయినా ప్రతిపక్షాలు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు ఇస్తే కచ్చితంగా స్వీకరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని, అధికారులు అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Source link