అయితే ఏడాది కాలంగా ఇలా నిరసనలతో దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయంటూ జూనియర్ రెజ్లర్లు రోడ్డెక్కారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో వీళ్ల నిరసన మొదలైంది. హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ లకు చెందిన జూనియర్ రెజ్లర్లు ఇందులో పాల్గొన్నారు. వీళ్లలో చాలా మంది బాగ్‌పట్ లోని ఆర్యసమాజ్ అఖాడా, ఢిల్లీ శివార్లలోని వీరేందర్ రెజ్లింగ్ అకాడెమీలకు చెందిన వాళ్లు ఉన్నారు.