Entertainment

మెగాస్టార్‌ను పద్మవిభూషణ్‌తో సత్కరించనున్న కేంద్ర ప్రభుత్వం?


మెగాస్టార్‌ చిరంజీవి నటుడిగానే కాదు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా టాలీవుడ్‌లో పేరుంది. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ కావచ్చు, చిత్ర పరిశ్రమలో ఆర్థికంగా చితికిపోయినవారికి సహాయం చేయడం కావచ్చు.. ఇలా సహాయం కోరుకునేవారికి అందుబాటులో ఉంటూ తన సేవా తత్పరతను చాటుకుంటూనే ఉన్నారు చిరంజీవి. ఆమధ్య కోవిడ్‌ వల్ల లాక్‌డౌన్‌ విధించినపుడు చిత్ర పరిశ్రమలోని కార్మికులకు నిత్యావసర వస్తువులను దఫదఫాలుగా అందజేశారు. అంతేకాదు, అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేశారు. 

నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న మెగాస్టార్‌ ఔన్నత్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని అందించబోతోందన్న వార్తలు వస్తున్నాయి. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవం రోజున మెగాస్టార్‌ చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందించనున్నారని సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంవత్సరం పద్మ అవార్డులు అందుకునే వారి లిస్ట్‌లో చిరంజీవి పేరు కూడా ఉన్నట్టు ఢల్లీి నుంచి సమాచారం వచ్చిందని టాక్‌.  2006లో చిరంజీవిని పద్మభూషణ్‌ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం దేశమంతా ఎదురుచూస్తున్న రామాలయ ప్రారంభోత్సవం జనవరి 22న అయోధ్యలో వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోది నుంచి చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చిరంజీవి భావిస్తున్నారు. 

 



Source link

Related posts

ఆరుగురు హీరోయిన్లతో హీరామండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

వోడ్కా వర్మతో సురేఖ కూతురు.. సుప్రీతను కూడా లైమ్‌లైట్‌లోకి తెచ్చేస్తాడా?

Oknews

సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Oknews

Leave a Comment