Entertainment

ఎన్టీఆర్ ఘాట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ త్వరగా వెళ్లిపోవడానికి కారణం ఇదే


తెలుగు జాతి  ఈ విశ్వంలో మనుగడ సాగిస్తున్నంత  కాలం ఎన్టీఆర్ (ntr)అనే పేరుని మాత్రం మర్చిపోదు. సినిమాల్లో రాజకీయాల్లో ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర నడుస్తున్న యుగానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈ రోజు ఆ మహానుభావుడి 27 వ వర్ధంతి. రు.ఈ సందర్భంగా  హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్దకి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లడం అక్కడ అభిమానులు చేసిన పని చర్చినీయాంశ మయ్యింది.

జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు తెల్లవారు జామున ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తన తాత దివ్యసమాధిని దర్శించుకొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  అక్కడకి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జై ఎన్టీఆర్ అంటు నానా హంగామా సృష్టించారు. అలాగే  సీఎం సీఎం అంటు పెద్ద పెద్దగా నినాదాలు కూడా  చేస్తు ఎన్టీఆర్ ని ఫోటోలు తీసేందుకు పెద్ద ఎత్తున ఎగబడ్డారు.దీంతో జూనియర్ ఎన్టీఆర్ అక్కడనుంచి త్వరగానే వెళ్ళిపోయాడు.కళ్యాణ్ రామ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ వెంట ఉన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్  కి తన తాత ఎన్టీఆర్ అంటే ఎంత ప్రాణమో తెలుసు. అలాగే పెద్దాయన కి కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ప్రాణం. ఈ విషయాన్ని చాలా సార్లు కీర్తిశేషులు హరికృష్ణ  చెప్పారు.అలాగే పెద్దాయనే తన పేరుని జూనియర్ ఎన్టీఆర్ కి పెట్టారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ అభిమానులు  రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అన్నదానాలు చేస్తున్నారు. 1996 జనవరి 18 న ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరినీ శోక సంద్రంలో ముంచెత్తుతు మానవ లోకాన్ని విడిచి స్వర్గ లోకానికి వెళ్లారు. 



Source link

Related posts

rajinikanth-health-condition-stable – Telugu Shortheadlines

Oknews

ఫ్యామిలీ సినిమా అన్నారు.. ఈ బూతులేంటి సామీ!

Oknews

రాజ్ తరుణ్ కేసులో మరో సంచలనం.. హీరోయిన్ పై హత్యాయత్నం.. మూడు కత్తి పోట్లు…

Oknews

Leave a Comment