నా జోస్యం నిజమైంది..గతంలో ఖమ్మంలో మంత్రిగా పని చేసిన పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయంగా తుడిచిపెట్టుకుపోతాడని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. నేను చెప్పినట్లుగానే ఖమ్మంలో అజయ్ రాజకీయం ముగిసిందన్నారు. ఖమ్మంలో ఇప్పుడు స్వేచ్ఛపూరిత వాతావరణం కనిపిస్తుందని తెలిపారు. ప్రజలు మనోధైర్యంతో జీవిస్తున్నారన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోను ఇవే ఫలితాలు రానున్నాయని రేణుక పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య మీదే ఈ ప్రభుత్వం ఏర్పడిందని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఖమ్మంలో మాజీ మంత్రి ఎన్ని కేసులు పెట్టినా తట్టుకొని నిలబడ్డందుకు ముస్తఫాను రేణుక ప్రత్యేకంగా అభినందించారు. నియంతృత్వానికి, అక్రమాలకు, నిర్బంధాలకు వ్యతిరేకంగా పని చేసిన నా కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవడం నా భాధ్యత అని పేర్కొన్నారు.
Source link