Entertainment

మహేష్ దెబ్బ.. గురూజీ అబ్బా…


సాధారణంగా సినిమా రిజల్ట్ విషయంలో హీరోకి, దర్శకుడికి సమానంగా క్రెడిట్ ఉంటుంది. కానీ ‘గుంటూరు కారం’ చిత్రం విషయంలో మాత్రం పాజిటివ్ క్రెడిట్ మహేష్ బాబుకి, నెగిటివ్‌ క్రెడిట్ త్రివిక్రమ్ కి అన్నట్టుగా ఉంది.

‘అతడు’, ‘ఖలేజా’ తరువాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో రూపొందిన ‘గుంటూరు కారం’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ పై విమర్శలు వచ్చాయి. ‘అత్తారింటికి దారేది’ మూడ్ నుంచి గురూజీ ఇంకా బయటకు రాలేదని, అదే కథను అటు తిప్పి ఇటు తిప్పి తీస్తున్నాడని ట్రోల్ చేశారు. రచనపై ఆయన మునుపటిలా శ్రద్ధ పెట్టట్లేదని, ఆయన కలంలో అప్పటి పవర్ కనిపించట్లేదని అంటున్నారు. సినిమా విడుదల రోజు కంటెంట్ పరంగా ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా.. వసూళ్ల విషయంలో మాత్రం ఈ సినిమా వెనకడుగు వేయట్లేదు. ఈ విషయంలో మాత్రం పూర్తి క్రెడిట్ మహేష్ బాబుదే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారీ బిజినెస్ చేసిన సినిమాకి డివైడ్ టాక్ వస్తే ఆశించిన వసూళ్లు రావడం కష్టం. భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. కానీ ‘గుంటూరు కారం’ విషయంలో మాత్రం అలా జరగడంలేదు. రూ.130 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ డివైడ్ టాక్ తో కూడా ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది. కేవలం మహేష్ స్టార్డంతోనే ఈ కలెక్షన్స్ వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకి మంచి క్రేజ్ ఉంది. మహేష్ సినిమా అంటే ఎంతో కొంత కంటెంట్ ఉంటుందనే అభిప్రాయం కుటుంబ ప్రేక్షకుల్లో ఉంది. అదే వారిని థియేటర్లకు కదిలేలా చేసింది. మహేష్ కాకుండా వేరే ఏ హీరో అయినా.. డివైడ్ టాక్ తో ఒక రీజినల్ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం సాధ్యంకాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సినిమాకి వచ్చిన టాక్, కలెక్షన్స్ ని బట్టి.. గురూజీ ఓడాడు, మహేష్ గెలిచాడు అని చెబుతున్నారు.

మహేష్ బిగ్ స్టార్, పైగా తన తదుపరి సినిమాని రాజమౌళి డైరెక్షన్ లో చేయనున్నాడు. కాబట్టి ‘గుంటూరు కారం’ రిజల్ట్ మహేష్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపదు. అయినా ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. తన స్టార్ పవర్ ఏంటో మరోసారి చూపించాడు మహేష్. కానీ త్రివిక్రమ్ పరిస్థితి అలా కాదు. ఎందుకంటే ఎంత స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ఒక్క ఘోర పరాజయం ఎదురైతే, మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్ కి అలాంటి సిచువేషనే వచ్చింది. ముఖ్యంగా రొటీన్ స్టోరీలు అనే నింద పోగొట్టుకోవాల్సి ఉంది. అల్లు అర్జున్ తో గురూజీ ఓ పాన్ ఇండియా మూవీ చేయాల్సి ఉంది. అది స్టార్ట్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు వెంకటేష్ తో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. ఆ సినిమాతో తన కలం బలం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటే.. త్రివిక్రమ్ పాన్ ఇండియా మార్గం సుగమం అవుతుంది. లేదంటే గురూజీతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.



Source link

Related posts

మహేష్‌ లుక్‌ పూర్తిగా మారిపోతోంది.. రెడీ అవుతున్న రాజమౌళి!

Oknews

ఎన్టీఆర్‌ చెయ్యని ఆ సినిమా రామ్‌చరణ్‌కి వర్కవుట్‌ అవుతుందా?

Oknews

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుత గొప్పతనానికి వేంకటేశ్వర స్వామినే కారణమా!

Oknews

Leave a Comment