Telangana

Rythu Bandhu Scheme Updates : ‘రైతుబంధు స్కీమ్’ బిగ్ అప్డేట్



గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎకరానికి రూ. 5వేలను జమ చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికల హామీలో భాగంగా… కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతుభరోసాగా మారనుండగా… కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.



Source link

Related posts

మేడారం జాతరలో ‘ట్రైబల్ ఆర్ట్ సమ్మేళనం’-a tribal art exhibition will be organized in medaram sammakka saralamma jatara 2024 ,తెలంగాణ న్యూస్

Oknews

ACB Raid in Hyderabad : రూ. 84 వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ అధికారిణి – ఆపై కన్నీళ్లు..!

Oknews

హైదరాబాద్ లో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, నైజీరియన్ అరెస్ట్-hyderabad crime news in telugu nigerian arrested in punjagutta seized 8 crore worth drugs ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment