Latest NewsTelangana

Governor Tamilisai X Account Hack Case Three IP Addresses Identified


Governer X Account Hacking Case : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ (Tamil Sye Soundarrajan ) ఎక్స్‌   అకౌంట్ హ్యాక్ కేసులో సైబర్ పోలీసులు కొలిక్కి తీసుకువచ్చారు. మన దేశంలోనే మూడు ఐపీ అడ్రస్‌ల నుంచి ఆపరేట్‌ అయినట్టు తెలంగాణ పోలీసులు (Telangana Police) గుర్తించారు. ఐపీ అడ్రస్‌ల వివరాలు పంపాలంటూ…టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల (Service Providers ) కు లేఖలు రాశారు.  హాత్‌వే, యాక్ట్‌ సహా మరో ఇంటర్నెట్‌ సర్వీసు ద్వారా గవర్నర్‌ ఖాతాను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది. వివరాలు వచ్చిన తర్వాత నిందితులను పట్టుకుంటామని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెల్లడించారు. 

గవర్నర్ కు సంబంధం లేని పోస్టులు

కంపెనీ నియమ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎక్స్​ కంపెనీ నుంచి గవర్నర్​ తమిళి సైకి మెయిల్ వచ్చినట్లు సమచారం. గవర్నర్ తన అకౌంట్​ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. పాస్‌వర్డ్ తప్పంటూ జవాబు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తమిళిసైకి సంబంధంలేని పోస్టులు పెట్టారు. గవర్నర్ తమిళిసై ఆదేశాలతో రాజ్​భవన్​ అధికారులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  గవర్నర్ ఎక్స్​ అకౌంట్​ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మొన్న మంత్రి దామోదర…నిన్న ఎమ్మెల్సీ కవిత
ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాంకింగ్ కు గురయ్యాయి. మంత్రి రాజనర్సింహా సోషల్ మీడియా అకౌంట్ ను…సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంత్రికి సంబంధం లేని బీజేపీ, టీడీపీ, తమిళనాడుకు చెందిన పలు రాజకీయ పార్టీల ఫొటోలను పోస్టు చేయడం దుమారం రేపింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్…సోషల్ మీడియా ఖతాలను హ్యాక్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి పాస్‌వర్డ్ మార్చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఇటీవలే కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎక్స్ సహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను హ్యాక్‌ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డీసీపీ, సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ట్యాగ్ చేస్తూ కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోగి చొరబడి…సంబంధం లేని వీడియోను పోస్టు చేసినట్టు వెల్లడించారు. 

గతంలో ప్రధానితో పాటు సెలబ్రెటీల ఖాతాలు హ్యాక్
గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విటర్ ఖాతాను దుండగులు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. కేంద్ర మంత్రుల ఖాతాలు, వివిధ ప్రభుత్వ ఖాతాలు, మంత్రుల ఖాతాలు హ్యాక్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిల్లలు, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాక్ చేశారు. వారికి సంబంధం లేకుండా పోస్టులను…సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు. ఆ తర్వాత బాధితులంతా తమ ఖాతా హ్యాక్ అయిందంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. గతంలో విదేశాంగ శాఖలోని విదేశీ వ్యవహారాల విభాగం ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలను హ్యాకర్లు పట్టుకుంటున్నట్లు సమాచారం.  ట్విటర్, వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సామాజిక మాధ్యమ వేదికలు జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరు ఒకటికి మించి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఈజీగా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. 

 



Source link

Related posts

CM Revanth Reddy : తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకోండి – సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Oknews

కొరియన్ స్టార్ మా డాంగ్ సియోక్ తో ప్రభాస్ గొడవ!  ఇటలీలో ఎంజాయ్ 

Oknews

Does Jagan have the guts to touch Revanth? రేవంత్‌ను టచ్ చేసే దమ్ము జగన్‌కు ఉందా..

Oknews

Leave a Comment