Sports

Ravichandran Ashwin Receives Ram Lalla Pran Pratishtha Invitation


అయోధ్య(Ayodhya)లో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. తాజాగా మరో భారత స్టార్‌ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin)కు ఆహ్వానం అందింది. తమిళనాడు  బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్య, ఉపాధ్యక్షుడు వెంకట్రామన్‌ అశ్విన్‌కు ఆహ్వాన పత్రికతో పాటు అక్షతలు అందజేశారు. ఇప్పటికే ఇప్పటికే ప్రముఖ క్రికెటర్లు సచిన్‌, ధోని, కోహ్లీ… సినీ ప్రముఖులు అక్షయ్‌ కుమార్‌, కంగనా రనౌత్‌, టైగర్‌ ష్రాఫ్‌, జాకీ ష్రాఫ్‌, హరిహరన్‌, రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, చిరంజీవి, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, రణ్‌దీప్‌ హుడాలకు ఇప్పటికే ఆహ్వానాలందాయి.

విరుష్క దంపతులకు ఆహ్వానం
దాదాపు 55 దేశాలకు చెందిన వంద మంది ఎంపీలు, రాయబారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు ఇచ్చినట్లు ప్రపంచ హిందూ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానానంద తెలిపారు. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్‌ రాణికి కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు…. ఆహ్వానం అందింది. ముంబయి(Mumbai)లోని కోహ్లీ నివాసానికి వెళ్లిన ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. అఫ్గాన్‌నిస్థాన్‌(Afghanistan)తో మూడో టీ20 ఆడటానికి బెంగళూరు బయల్దేరడానికి ముందు స్వయంగా ఆహ్వానాన్ని స్వీకరించడానికి కోహ్లీ ముంబయికి వచ్చినట్లు తెలుస్తోంది. వేడుకకు వెళ్లేందుకు విరాట్ కొహ్లీ బీసీసీఐ అనుమతి కూడా తీసుకున్నారు. ఇప్పటికే దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీ, వెంకటేశ్ ప్రసాద్ లకు ఆలయ కమిటీ ఆహ్వానాలు ఇచ్చింది. 

రాముడిపై కుల్‌దీప్‌ అభిమానం
మైదానంలో దిగాడంటే ప్రత్యర్థి బ్యాటర్లను గింగిరాలు తిరిగే బంతులతో ముప్పు తిప్పలు పెట్టే టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల్లో అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానుండగా.. కుల్దీప్ యాదవ్ టాలెంట్ వైరల్ అవుతోంది. టీమిండియా స్టార్ బౌలర్ కుల్దీప్ యాదవ్.. శ్రీరాముడు, ఆంజనేయుడి పెయింటింగ్స్ వేశాడు. రే అనే నెటిజన్ కుల్దీప్ పెయింటింగ్స్ ను ట్విట్టర్ (ఎక్స్) లో పోస్ట్ చేశాడు. ప్రొఫెషనల్ పెయింటర్స్ తరహాలో కుల్దీప్ వేసిన శ్రీరాముడు, అంజనీ పుత్రుడు హనుమాన్ చిత్రాలు ఉన్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మైదానంలో ఈ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ టాలెంట్ మాకు తెలుసునని, ఆఫ్ ద ఫీల్డ్ కుల్దీప్ ఇలా దేవుడి బొమ్మల్ని ఎంతో శ్రద్ధగా గీస్తాడని.. ఇది దేవుడు తనకు ఇచ్చిన గొప్ప టాలెంట్ అని కామెంట్ చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, అర్జెంటీనా, ఆస్ర్టేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఫిన్‌లాండ్‌, హాంగ్‌ కాంగ్‌, కెనడా,ఇటలీ, ఐర్లాండ్‌, మెక్సికో, న్యూజిలాండ్‌… సహా మెుత్తం 55 దేశాలకు చెందిన ప్రతినిథులు హాజరుకానున్నట్లు….. విజ్ఞానానంద తెలిపారు. దేశాధినేతలు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.



Source link

Related posts

RCB WPL 2024 టైటిల్ సాధించటంతో బెంగళూరులో అర్ధరాత్రి దాటేదాకా సాగిన ఫ్యాన్స్ సంబరాలు

Oknews

Bumrah Creates History In Ipl 2024 Became First Bowler To Take Five Wickets Against Rcb In Ipl Mi Vs Rcb

Oknews

ఈ బక్కపలుచటి బాపు… భారత్ కు వరల్డ్ కప్ అందించాడు..

Oknews

Leave a Comment