Top Stories

అల్ప సంతోషి చంద్రబాబు…!


టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎప్పుడూ అన్నీ కొత్తే. మీటింగ్ కి వచ్చిన జనాన్ని చూసి నభూతో నభవిష్యత్తు అంటారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఈ జనం రాలేదు అంటారు. అంటే గతంలో తన పట్ల టీడీపీ పట్ల జనానికి అంతటి అభిమానం ఆదరణ లేదనుకోవాలా లేక ఇప్పుడు పెరిగింది అనుకోవాలో బాబే చెప్పాలి.

అరకులో చంద్రబాబు ఇలాంటి మాటలే చాలా మాట్లాడారు. ఆయన గిరిజనులు తన మీద కురిపించిన అభిమానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నారు. ఇంతటి ప్రేమ ఎన్నడూ చూడలేదని చెప్పేసుకున్నారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి గత పాతికేళ్లుగా టీడీపీ అరకులో గెలిచింది లేదు.

అప్పుడెపుడో 1999లో గెలిచింది. ఆ తరువాత అటు అరకు పాడేరుగా మారిన చింతపల్లి ఈ రెండు సీట్లలో టీడీపీ ఆయిదారు ఎన్నికల నుంచి ఓడుతూనే వస్తోంది. అరకు ఎంపీ సీటు అలాగే ఉంది. చంద్రబాబు రా కదలిరా అంటూ అరకులో మీటింగ్ పెట్టడం వెనక అక్కడ పాగా వేయాలన్న ఉద్దేశ్యం ఉండడమే.

అరకులో వైసీపీ నుంచి వచ్చిన నేతకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. శనివారం అరకు సభకు బాబు హాజరయ్యారు. అరకు కాఫీకి పేరు తెచ్చానని,  ఈ సందర్భంగా బాబు చెప్పుకున్నారు. అరకు కాఫీని విశ్వవ్యాప్తం చేశానని కూడా చెప్పుకున్నారు. అరకు అభివృద్ధి విషయంలో తాను వెనకంజ వేయలేదని అన్నారు.

అయితే చంద్రబాబు సీఎం గా ఉండగానే బాక్సైట్ గనుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం ఆ తరువాత విపక్షాల పోరాటంతో రద్దు చేయడం జరిగిందని వైసీపీ గుర్తు చేస్తోంది. గిరిజనులు ఎపుడూ మభ్యపెట్టే వారిని నమ్మరని అంటోంది. చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా అరకు లో వైసీపీదే విజయం అంటోంది. చంద్రబాబు అయితే ఈసారి విశాఖ ఏజెన్సీలో సైకిల్ జోరు చేయాలని పరితపిస్తున్నారు. బాబు కోరిక తీరుతుందా లేక వచ్చిన జనాలను చూసి తృప్తి పొందుతూ ఉంటారా అన్నది తెలిసేది ఎన్నికల ఫలితాల తరువాతనే అని అంటున్నారు అంతా.



Source link

Related posts

తేజ్ బ్రదర్స్.. నెక్ట్స్ ఏంటీ?

Oknews

స్కంద నుంచి పూర్తిగా బయటకొచ్చిన హీరో

Oknews

లియో ట్రయిలర్ రిలీజ్.. థియేటర్ ధ్వంసం

Oknews

Leave a Comment