Top Stories

భవ్య రామమందిర నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు


నిర్మాణంలో ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మరి రామ మందిరం నిర్మాణానికి ఎలాంటి టెక్నాలజీ వాడారు? ఎన్ని టన్నుల స్టీల్ వాడారు? ఎంత సిమెంట్ వాడాల్సి వచ్చింది? ఎన్ని టన్నుల ఇనుము ఉపయోగించారు?

ఇక్కడే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు సైంటిస్టులు. రామమందిర నిర్మాణంలో అసలు స్టీల్, ఐరన్ వాడలేదని చెబుతున్నారు. ఐరన్ లేదా స్టీల్ జీవితకాలం 80-90 ఏళ్లు మాత్రమే. రామ మందిరం 2000 ఏళ్లకు పైగా నిలిచేలా నిర్మించారట. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్ (సీబీఆర్ఐ) రామమందిర నిర్మాణంలో చురుగ్గా పాల్గొంది. ముందుగా భూగర్భం నుంచి వీళ్లు సర్వే నిర్వహించారు. పక్కనే సరయు నది ప్రవహిస్తుండడంతో.. అడుగున మట్టి మొత్తం చాలా వదులుగా ఉంది. అందుకే మందిర నిర్మాణం కోసం వీళ్లు 15 మీటర్ల లోతు వరకు త్రవ్వి, ఇసుక-మట్టి మొత్తాన్ని బయటకు తీశారు.

అలా త్రవ్విన ప్రాంతాన్ని ఇంజనీరింగ్ సాయిల్ తో నింపారు. అలా ఆలయం కింద భాగంలో రాయి లాంటి నిర్మాణం కోసం 47 పొరలతో గట్టి ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. దానిపై 1.5 మీటర్ మందంతో ఎమ్-35 గ్రేడ్ కాంక్రీట్ ను వేశారు. దానిపై 6.3 మీటర్ల మందం ఉన్న అత్యంత దృఢమైన గ్రానైట్ రాయి వేశారు. ఆపై మందిర నిర్మాణం చేపట్టారు

ఈ క్రమంలో ఎక్కడా స్టీల్ లేదా ఐరన్ వాడలేదు. 2.7 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రాంగణంలో 57వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణంలో గ్రానైట్, ఇసుక రాయి, పాలరాయిని మాత్రమే ఉపయోగించారు. జాయింట్స్ లో ఎక్కడా సిమెంట్ లేదా మోర్టార్ వాడలేదు. కేవలం రాయి స్వభావాన్ని పరిశీలించి, లాక్ అండ్ కీ మెకానిజం (ఇంటర్ లాకింగ్ సిస్టమ్) ఆధారంగా నిర్మాణం చేపట్టారు. రాజుల కాలంనాటి పురాతన కట్టడాలన్నీ ఈ విధంగా నిర్మించినవే.

3 అంతస్తులుగా నిర్మించిన ఈ మందిరం, భారీ భూకంపాల్ని సైతం తట్టుకొని, 2500 సంవత్సరాల పాటు నిలిచేలా కట్టడాన్ని నిర్మించారు. ఆలయ పైభాగం ఆకర్షణీయంగా కనిపించడం కోసం సహజసిద్ధంగా దొరికే పింక్ కలర్ రాయిని ఉపయోగించారు. ఇక గర్భగుడి కోసం రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మఖ్రానా పాలరాయిని వాడారు. ఎండాకాలంలో కూడా సహజసిద్ధంగా చల్లదనాన్ని అందిస్తుంది ఈ రాయి.నగర నిర్మాణ శైలిలో కట్టిన ఈ మందిరంలో సూర్యతిలక్ వాస్తును అవలంబించారు. కోణార్క్ దేవాలయాన్ని ఇదే పద్ధతిలో నిర్మించారు. 



Source link

Related posts

బాబు హెల్త్ రిపోర్ట్‌పై వివాదం!

Oknews

సభలోకి లైన్ క్లియర్.. కేబినెట్‌లోకి వస్తారా?!

Oknews

ఆ జంట మ‌ధ్య బ్రేక‌ప్‌!

Oknews

Leave a Comment