Sports

Sania Mirzas Father Confirms Her Khula With Shoaib Malik Amid His Marriage With Sana Javed


అనుమానాలను నిజం చేస్తూ… స్టార్‌ కపుల్‌ సానియా మీర్జా(Sania Mirza)  షోయబ్‌ మాలిక్‌(Shoaib Malik) జోడీ విడిపోయింది. కొన్నేళ్లుగా షికార్లు చేస్తున్న పుకార్లు నిజమేనని రుజువైంది. సానియాతో 14 ఏళ్ల పెళ్లి బంధానికి షోయబ్‌ వీడ్కోలు పలికాడు. సానియా మీర్జాతో విడిపోతున్నట్లు వచ్చిన వార్తలను వాస్తవమేనని రుజువు చేస్తూ… పాక్‌ క్రికెటర్‌ షోయబ్ మాలిక్.. నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. నటి సనా జావెద్‌తో ఉన్న ఫొటోలను షోయబ్‌ మాలిక్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. గత ఏడాది సనా జావెద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత షోయబ్‌ మాలిక్… సనా జావెద్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఇటు షోయబ్‌ మాలిక్‌ కానీ… అటు సనా కానీ ఎవరూ ఖండించలేదు. అప్పటినుంచే షోయబ్‌ మాలిక్‌- సానియా విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు షోయబ్‌ మాలిక్‌ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహంపై సానియా తండ్రి స్పందించాడు.

 

సానియా తండ్రి ఏమన్నారంటే..?

తన అల్లుడు షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్‌(Sana Javed)ను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ముస్లిం చట్టం ‘ఖులా’ ప్రకారం షోయబ్ మాలిక్, సానియా విడిపోయారని స్పష్టం చేశారు. ముస్లిం లా ‘ఖులా’ ప్రకారం విడిపోయారని.. ముస్లిం మహిళ తన భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కును ఖులా సూచిస్తుందని తెలిపారు. ఖులా అనేది స్త్రీ తన భర్త నుంచి విడాకులు కోరే ఒక ప్రక్రియ. ఇది వరకట్నాన్ని తిరిగి ఇవ్వడం లేదా తన హక్కులలో కొంత భాగాన్ని వదులుకోవడం. తన భర్త నుండి విడాకులు కోరుకునే అవకాశం ముస్లిం స్త్రీకి ఖులా చట్టం కల్పిస్తుంది.

 

సానియా వేదాంతంతో అనుమానాలకు బలం

” వివాహం చేసుకోవడం కష్టం. విడాకులు తీసుకోవడం ఇంకా కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి” అంటూ సానియా షేర్‌ చేసిన ఇన్‌ స్టా స్టోరీతో మళ్లీ విడాకుల గురించి చర్చ మొదలైంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మీరు చేసుకునే ఎంపికను బట్టి జీవితం ఉంటుందంటూ సానియా ఆ పోస్ట్‌లో షేర్‌ చేసింది. సానియా షేర్‌ చేసిన ఈ స్టోరీ క్షణాల్లో వైరల్‌గా మారింది. భర్త షోయబ్‌ మాలిక్‌తో సానియా విడిపోతోందని… అందుకే ఇలా పోస్ట్‌ చేసిందన్న ఊహాగానాలు చెలరేగాయి. 

 

2010లో ప్రేమ వివాహం

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010 లో పాక్ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇజాబ్ అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంత కాలంగా సానియా పాకిస్థాన్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది. గతంలో షోయబ్ మాలిక్ సైతం ట్విటర్ అకౌంట్‌లో రిలేషన్‌షిప్ స్టేటస్ నుంచి సానియా మీర్జా నేమ్‌ను తీసేశాడు. తాజాగా సానియా తన ఇన్‌స్టా నుంచి షోయబ్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో సానియా- షోయబ్‌ త్వరలోనే డివోర్స్ తీసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.



Source link

Related posts

A rare milestone unlocked for Virat Kohli as he reaches to 100th half century in T20 Cricket

Oknews

Injured David Warner Ruled Out Of New Zealand Tour Likely To Be Fit For Ipl

Oknews

MI vs DC IPL 2024 Suryakumar yadav disappointed out for two balls no runs

Oknews

Leave a Comment