EntertainmentLatest News

పూరి జగన్నాధ్ రూటే సపరేటు..ఐటెం సాంగ్ లో ఈ హీరోయిన్?


లైగర్ సినిమా పరాజయంతో  ఈ  సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో దర్శకుడు పూరి(puri jagannadh)తెరక్కిస్తున్న మూవీ  డబుల్ ఇస్మార్ట్ (double ismart) శరవేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ (ram)హీరోగా చేస్తున్నాడు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ మూవీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

పూరి దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ తెరకెక్కాయి. పైగా ఆ పాటల్లో నర్తించే నటీమణుల విషయంలో కూడా పూరి చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ క్రేజీ హీరోయిన్ డింపుల్ హయతి డబుల్ ఇస్మార్ట్ లో ని  ఐటెం సాంగ్ లో నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా లో కూడా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నడింపుల్ డబుల్ ఇస్మార్ట్ లో ఐటెం సాంగ్ లో నటించబోతుందనే వార్త ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. కాకపోతే మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించాల్సి ఉంది.

పూరి అండ్  రామ్ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ లో ప్రముఖ హిందీ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. పూరి కనెక్ట్ పతాకంపై ఛార్మి ,పూరి లతో పాటు విష్ణు రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. గతంలో రామ్,పూరి ల కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చాలా పెద్ద విజయం సాధించడంతో డబుల్ ఇస్మార్ట్ పై అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 న  తెలుగు, తమిళ ,మలయాళ  కన్నడ, హిందీ భాషల్లో డబుల్ ఇస్మార్ట్ విడుదల కానుంది.

 



Source link

Related posts

Bodh MLA Bapurao Cheating Case Filed Against Rathod Bapurao In Land Issue

Oknews

Why Bjp Pending Mahaboobnagar Mp Seat is Dk Aruna in MP Ticket Race

Oknews

Singer Mangli does not believe the news ఆ వార్తలని నమ్మొద్దంటున్న సింగర్ మంగ్లీ

Oknews

Leave a Comment