Telugu News Today 22 January 2024: వైభవంగా ముగిసిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ, మందిరంలో కొలువు దీరిన బాల రాముడు
500 ఏళ్ల ఎదురు చూపులకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఉద్విగ్నంగా నిరీక్షించిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా పూర్తైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహించారు. వేదమంత్రోఛ్చారణల మధ్య ఈ ఘట్టం పూర్తైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
భారత్ న్యాయ జోడో యాత్రపై దాడి ఖండించిన షర్మిల- నిరసనలకు పిలుపు
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ న్యాయ జోడో యాత్రపై అసోంలో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. అసోంలో అప్రతిహాతంగా సాగిపోతున్న భారత్ న్యాయ జోడో యాత్రపై అతివాద బీజేపీ గూండాల దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో నిరాటంకంగా సాగిపోతున్న యాత్ర కోట్ల ప్రజల హృదాయాలను కలుపుతూ, వారిని చైనత్య పరుస్తూ దూసుకుపోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని ఆమె ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అమలాపురంలో ఆశావాహుల జోరు – మూడు పార్టీల్లోనూ టికెట్‌కు పెరిగిన పోటీ!
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.. పార్టీలో ఇన్నాళ్లు కష్టపడ్డాం.. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, పార్టీ మమ్మల్ని గుర్తించాలి.. అని కొందరు అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తుంటే గెలిచే సత్తా మాకు ఉంది. ఇంతవరకు పల్లకి మోసిన నేతలు స్థానికులు కాదు.. ఇకపై వారి నాయకత్వం మాకు అక్కర్లేదు మానుంచే నాయకులు రావాలి… అందుకే స్థానికులమైన మాకు టిక్కెట్టు కేటాయించాలని మరో ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హామీలు అమలు చేయకపోతే తిరుగుబాటే – కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక
కార్యకర్తలే పార్టీకి కథనాయకులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో నల్లగొండ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యకర్తల వల్లే ఇన్నేళ్ళుగా పార్టీ బలంగా ఉందన్నారు. చివరిగా నల్లగొండ రివ్యూ చేస్తున్నామని గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి దైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. నల్లగొండ లో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందన్నారు. ఎక్కడా ఓటమి పై అనుమానాలు రాలేదు కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు- తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇప్పటికే ఆ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసింది. సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘వ్యూహం’ సినిమా తెరకెక్కించారని ఆరోపిస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి