పరీక్ష విధానం
గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. స్క్రీనింగ్ పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. ఈ పరీక్షను 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ లో రెండు పేపర్లను 300 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.