Sports

Nivetha Pethuraj Wins State Level Badminton Championship


ప్రముఖ సినీనటి నివేతా పేతురాజ్‌(Nivetha Pethuraj) బాడ్మింటన్‌( Badminton)లో సత్తాచాటింది. తమిళనాడు(Tamilanadu)లో జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌(State Level Championship) పోటీల్లో నటి నివేతా విజేతగా నిలిచింది. మధురైకు ప్రాతినిథ్యం వహిస్తున్నా నివేతా  మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ప్రత్యర్థి జంటపై గెలిచి  ఛాంపియన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్‌లో ఖాతాలో పంచుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తన సహచర ఆటగాడితో కలిసి ట్రోఫీతో ఉన్న ఫోటోలను నివేతా ఎక్స్‌లో పెట్టింది. సినిమాలతో పాటు ఆటల్లోనూ రాణిస్తున్నా నివేతాకు పెద్దఎత్తున అభిమానులు అభినందలు తెలుపుతున్నారు.

కోలీవుడ్ నటి నివేదా పేతురాజ్  తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఆ తరువాత చిత్రలహరి, పాగల్, అల వైకుంఠపురములో అంటూ ఇలా చాలా చిత్రాల్లోనే నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగువారికి మెంటల్ మదిలో కథాకనాయికగా పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత బ్రోచేవారెవరురా, రెడ్, దాస్ కా ధమ్కీ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ సిమిమాల్లో తళుక్కున మెరిసిన ఈ భామ ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్, మూవీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఓవైపు హీరోయిన్‏గా సినిమాల్లో నటిస్తూనే నివేదా పేతురాజ్ ఇప్పటికే ఎఫ్ 1 కార్ రేసర్ గా  పలు పతకాలు సాధించింది. అయితే తాజాగా  బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా సాధించింది.

తమిళనాడులో జరిగిన స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మధురై తరుపున డబుల్స్ ఆడి విన్నర్ గా నిలిచింది. తనకు వచ్చిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ కప్ తో ఫోటోలు దిగి నెట్టింట షేర్ చేసింది. మిక్డ్స్ డబుల్స్‌లో నివేదా ఈ కప్పు కొట్టినట్టుగా కనిపిస్తోంది. బెస్ట్ కోచ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో తన సంతోషాన్పి పంచుకుంది. ఇక వాట్ నెక్ట్స్? అంటూ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అంటే నెక్ట్స్ ఇంకో స్పోర్ట్స్‌లో కప్పు కొడతానని చెబుతోందా? అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతోన్నారు. ఆల్రెడీ హీరోయిన్ గా దూసుకుపోతుంది, కార్ రేసింగ్ చేస్తుంది, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా.. ఈ భామలో ఇంకెన్ని ట్యాలెంట్స్ ఉన్నాయో అని కామెంట్స్ చేస్తూ అభినందిస్తున్నారు. 

సినిమాల్లో నటించే చాలా మందికి చాలా రకాల టాలెంట్ లు ఉంటాయి. ఇంకొందరైతే  డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యానని చెబుతారు, ఇక శ్రీలీల, సాయి పల్లవి మెడిసిన్ చదువుతూ కూడా నటులుగా కొనసాగుతున్నారు, కొందరు  క్రీడా రంగంలో రాణిస్తున్నారు.. ఇటీవల తెలుగు సినీ నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ లో పథకాన్ని సాధించిన విషయం తెలిసిందే.. సౌత్ ఇండియా చాంప్ గా సిల్వర్ మెడల్ గెలుచుకుంది. 



Source link

Related posts

పరపరపరపప్పరా పరాగ్ 2.O గొప్పరా.!

Oknews

National Sports Awards 2023: తెలుగు బ్యాడ్మింటన్ ప్లేయర్‌కు జాతీయ అత్యున్నత క్రీడా పురస్కారం.. షమీకి అర్జున

Oknews

Team India Arrival T20 World Cup winners Rohit Sharma Virat Kohli touch down in Delhi

Oknews

Leave a Comment