యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా మొన్న సంక్రాంతికి వచ్చిన మూవీ నా సామిరంగ.ఆ మూవీలో అల్లరి నరేష్ వైఫ్ గా నటించిన నటి మిర్నా మీనన్. కేరళకి చెందిన మిర్నా ఆ మూవీలో తన అందంతోనే కాకుండా అభినయంతో కూడా అందర్నీ మెప్పించింది. తాజాగా ఆమెకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు ఆ న్యూస్ చూసిన వాళ్ళందరు ఇంతలోనే అంత ఛేంజా అని అనుకుంటున్నారు.
మిర్నా మీనన్ తాజాగా బర్త్ మార్క్ అనే మలయాళ చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిర్నా ఏడు నెలల గర్భిణీ పాత్రలో నటిస్తుంది. తాజాగా ఆ మూవీ మేకర్స్ మాట్లాడుతు గర్భిణీ పాత్రల్లో మిర్నా చాలా అధ్భుతంగా నటించిందని అసలు ఆమె తప్ప మరొకర్ని ఆ పాత్రలో ఊహించలేమని చెప్పారు. పైగా ఎంతో మందిని ఆడిషన్స్ చేశాకే మిర్నా తీసుకున్నామని కూడా చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలని చూసిన చాలా మంది నటన విషయంలో మిర్నా కి ఉన్న శక్తీ ఎంతటిదో అందరికి అర్ధం అయ్యింది. అలాగే గర్భిణీ పాత్రలో ఆమె జీవించిందని కూడా మేకర్స్ చెప్పారు.
ప్రముఖ దర్శకుడు విక్రమ్ శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి శ్రీరామ్ శివరామన్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సబీర్ కళ్ళ రక్కల్, ఇంద్రజిత్ ,ఫోర్ కోడి, బి ఆర్ వరలక్ష్మి లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ కూడా అదిరిపోవడంతో బర్త్ మార్క్ మీద అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మిర్నా ఇటీవల విడుదల అయ్యి ఘన విజయం సాధించిన జైలర్ లో రజనీ కాంత్ కోడలుగా కూడా చేసి అందర్నీ మెప్పించింది. 2020 లో మలయాళంలో వచ్చిన బిగ్ బ్రదర్ మూవీ ఆమెకి స్టార్ డం ని తెచ్చి పెట్టింది.