Entertainment

మళ్ళీ ఎన్టీఆర్ నే నమ్ముకుంటున్న త్రివిక్రమ్!


తన 28వ సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన జూనియర్ ఎన్టీఆర్(Jr NTR).. 30వ సినిమాని కూడా ఆయన డైరెక్షన్ లోనే చేయాలనుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘NTR30’ అంటూ అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అంతేకాదు ‘అయినను పోయి రావలెను హస్తినకు’ అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాని స్థానంలో తన 30వ సినిమాగా కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర'(Devara) చేస్తున్నాడు ఎన్టీఆర్. 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రావాల్సిన రెండో సినిమా ఆగిపోయినప్పటికీ.. భవిష్యత్ లో వారి కలయికలో ఖచ్చితంగా సినిమా ఉంటుందని, అది కూడా అత్యంత భారీ స్థాయిలో ఉంటుందని నిర్మాత నాగవంశీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ త్వరలోనే రెండోసారి చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.

అతి త్వరలోనే ‘దేవర’ షూటింగ్ పూర్తి చేసి, ఆ వెంటనే బాలీవుడ్ ఫిల్మ్ ‘వార్-2’తో బిజీ కానున్నాడు తారక్. దీని తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు, ‘దేవర-2’ లైన్ లో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఈ ఏడాది పట్టాలెక్కాల్సి ఉండగా, ఇప్పుడది వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ వచ్చింది. దానికి పార్ట్-2 కూడా ఉంది. ముందుగా ‘సలార్-2’ని పూర్తి చేస్తే.. ఎన్టీఆర్ తో చేయనున్న తన డ్రీం ప్రాజెక్ట్ పై మరింత ఫోకస్ పెట్టొచ్చని ప్రశాంత్ భావిస్తున్నాడట. దీనికి తారక్ సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి టైం పట్టే అవకాశముండటంతో ఈ గ్యాప్ మరో సినిమా చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఈ క్రమంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో నిర్మాత నాగవంశీ ఉన్నాడట. ఇటీవల ‘గుంటూరు కారం’తో షాక్ తిన్న త్రివిక్రమ్(Trivikram).. అల్లు అర్జున్ తో ఒక సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. అయితే ఆ సినిమా స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టనుంది. దీంతో ఈ గ్యాప్ లో ఓ చిన్న సినిమా చేయాలని గురూజీ అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తో ఓ భారీ సినిమానే ప్లాన్ చేస్తున్నాడట. గతంలో ‘అజ్ఞాతవాసి’ వంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన ‘అరవింద సమేత’తో హిట్ కొట్టాడు త్రివిక్రమ్. ఇప్పుడు ‘గుంటూరు కారం’ గాయానికి కూడా ఎన్టీఆర్ తోనే మందు రాయాలని భావిస్తున్నాడట. తారక్ కూడా గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా దర్శకుల ప్రతిభను మాత్రమే నమ్మి సినిమాలు చేస్తుంటాడు. ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ తర్వాత కొరటాలతో ‘దేవర’ వంటి భారీ సినిమా చేస్తున్నాడు. అదే బాటలో త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.



Source link

Related posts

'మ్యాడ్' కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే నిజంగానే మ్యాడ్ అయిపోతారు!

Oknews

‘గేమ్‌ ఛేంజర్‌’ స్పెషాలిటీ అదే.. అసలు విషయం చెప్పిన శంకర్‌!

Oknews

Feedly AI understands vulnerability threats – Feedly Blog

Oknews

Leave a Comment