1991 లో వచ్చిన కూలి నంబర్ 1 చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నటి టబు (tabu)మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు మనసు చూరగొన్న ఆమె ఆ తర్వాత వచ్చిన నిన్నే పెళ్లాడుతా మూవీతో తెలుగు ప్రేక్షకుల క్రేజీ కథనాయికి గా కూడా మారింది. అంతే కాకుండా ఆ మూవీతో కుర్రకారు కళల ప్రేయసి గా కూడా టబు నిలిచింది. తాజాగా ఆమెకి సంబంధిన ఒక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టబు తన కెరీర్ బిగినింగ్ లో తెలుగులోనే కాకుండా కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. అలా ఆమె నటించిన తమిళ మూవీల్లో ఒకటి కండు కొండెన్ (kandukondain)2000 వ సంవత్సరంలో తమిళ అగ్ర హీరో అజిత్ (ajith) హీరోగా వచ్చిన ఆ మూవీలో టబు సూపర్ గా నటించి తమిళం లో కూడా అభిమానులని సంపాదించింది. ఆ తర్వాత 2013 లో ఇంకో మూవీలో నటించిన టబు ఇక ఎలాంటి తమిళ సినిమాల్లోను నటించలేదు. అలాంటిది ఇప్పుడు అజిత్ హీరోగా ప్రారంభం కాబోతున్న నూతన చిత్రంలో టబు అజిత్ తో జతకట్టబోతుంది. అంటే 23 సంవత్సరాల తర్వాత టబు అజిత్ లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ వార్తలతో వెండి తెర మీద ఆ ఇద్దరి కాంబో ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ సినీ అభిమానుల్లో ఉంది.
కండు కొండెన్ తెలుగులో ప్రియురాలు పిలిచింది అనే పేరుతో కూడా డబ్ అయ్యి ఒక మోస్తరు విజయాన్నిమాత్రమే అందుకుంది. టాప్ డైరెక్టర్ రాజీవ్ మీనన్ (Rajiv Menon) దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలోని పాటలు నేటికీ చాలా చోట్ల మారుమోగిపోతుంటాయి. టబు ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి అల వైకుంఠ పురం మూవీలో బన్నీ తల్లిగా నటించి అందర్నీ మెప్పించిన విషయం తెలిసిందే.