EntertainmentLatest News

శ్రీలీల రేర్ ఫీట్.. ఎవరూ టచ్ చేయలేరు!


యువ సంచలనం శ్రీలీల(Sreeleela) పేరు కొంతకాలంగా టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. 2021లో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ.. మొదటి సినిమాతోనే తన అందం, డ్యాన్స్ లతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రెండో సినిమా ‘ధమాకా’ ఘన విజయం సాధించడంతో ఆమెకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో ఇప్పుడు ఆమె ఓ అరుదైన ఫీట్ ని సాధించింది. నెలకి ఒకటి చొప్పున ఆమె నటించిన సినిమాలు వరుసగా ఐదు విడుదలయ్యాయి.

గత ఐదు నెలలుగా ప్రతి నెలా శ్రీలీల బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూనే ఉంది. రామ్ కి జోడిగా నటించిన ‘స్కంద’ 2023, సెప్టెంబర్ 28న విడుదలైంది. బాలకృష్ణకు కూతురి తరహా పాత్రలో కనిపించిన ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19న ప్రేక్షకులను పలకరించింది. వైష్ణవ తేజ్ సరసన సందడి చేసిన ‘ఆదికేశవ’ నవంబర్ 24న రిలీజ్ అయింది. నితిన్ తో ఆడిపాడిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ డిసెంబర్ 8న జనం ముందుకు వచ్చింది. ఇక మహేష్ బాబుతో జత కట్టిన ‘గుంటూరు కారం’ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో అడుగు పెట్టింది.

ఇలా వరుసగా ఐదు నెలలు శ్రీలీల నటించిన ఐదు సినిమాలు ఆడియన్స్ ని పలకరించాయి. అయితే వీటిలో ‘భగవంత్ కేసరి’ మాత్రమే విజయం సాధించింది. మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేశాయి. మహేష్ స్టార్డంతో ‘గుంటూరు కారం’ మాత్రం కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించుకుంది.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు విజయ్, నితిన్ ల సినిమాలు ఉన్నాయి. అయితే ఆమె స్టార్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాలి. మంచి విజయాలను తన ఖాతాలో వేసుకోవాలి. లేదంటే ఆమె రేసులో వెనుకబడిపోయే అవకాశముంది.



Source link

Related posts

‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రివ్యూ

Oknews

petrol diesel price today 24 March 2024 fuel price in hyderabad telangana andhra pradesh vijayawada | Petrol Diesel Price Today 24 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oknews

Telangana Minister KTR Counter Attack On PM Modi For His Remarks At Mahabubnagar Meeting | KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్

Oknews

Leave a Comment