మొన్నటి వరకు తమ అభిమాన హీరో సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ లేక నిరాశలో ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కి వరుస గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సెప్టెంబర్ లో విడుదల కానుంది అంటున్నారు. అలాగే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న సినిమా షూటింగ్ మార్చి రెండో వారం నుంచి మొదలు కానుందట. అంతేకాదు ఈ మూవీ ఫస్ట్ లుక్ కి అప్పుడే ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న ‘RC 16’ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో హీరో పాత్రని దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా డిజైన్ చేశాడని, చరణ్ లుక్ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి తగిన సమయం తీసుకున్న ‘RC 16’ టీం.. పక్కా ప్లానింగ్ తో షూట్ కి వెళ్తోందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, షూటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరుగున్నాయని తెలుస్తోంది. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.