Top Stories

మళ్లీ థియేటర్ల తకరారు మొదలు


గట్టిగా రెండు మూడు వారాలు కాలేదు.. థియేటర్ల కోసం నిర్మాతలు కిందా మీదా పడి. పండగ సీజన్‌లో అన్ని సినిమాలు ఒకేసారి రావాలనుకోవడంతో తలనొప్పి మొదలైంది. మొత్తానికి పెద్దలు అంతా కలిసి రవితేజ ఈగిల్ సినిమాను వెనక్కు పంపడంతో సమస్య సద్దుమణిగింది. 

కానీ అప్పుడు సాధ్యా సాధ్యాలు చూసుకోకుండా సోలో డేట్ ఇస్తామని మాట ఇచ్చేసారు. కానీ అప్పటికే అక్కడ ఊరి పేరు భైరవ కోన సినిమా డేట్ వేసి వుందని మరిచిపోయారు. ఆ సినిమా నిర్మాతను సంప్రదించాలన్న సంగతి మరిచిపోయారు.

దాంతో ఇప్పుడు మళ్లీ థియేటర్ల సమస్య తలెత్తింది. ఫిబ్రవరి 8 లేదా 9 తేదీలకు మూడు సినిమాలు ప్లాన్ చేసుకున్నాయి. వైఎస్ జగన్ పాదయాత్ర మీద తీసిన యాత్ర 2, రవితేజ ఈగిల్, సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన సినిమాలు వున్నాయి.

యాత్ర 2 ను వెనక్కు తగ్గమని అడగలేరు. అది ఆంధ్ర సీఎంకు సంబంధించిన సినిమా. ఈగిల్ ను వెనక్కు వెళ్లమని అనలేరు. ఎందుకంటే దానిని వెనక్కు పంపిందే ఇండస్ట్రీ పెద్దలు. ఇక మిగిలింది భైరవ కోన. అందుకే ఇప్పుడు ఆ సినిమా మీద వత్తిడి చేస్తున్నారు.

కానీ నిర్మాత రాజేష్ దండా ససేమిరా అంటున్నారు. దాంతో ఆ సినిమా సమర్పకులు అనిల్ సుంకర మీద సినిమా పెద్దలు వత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. కానీ వెనక్కు వెళ్తే వడ్డీలు ఎవరు భరిస్తారని, పైగా సినిమాను హోల్ సేల్‌గా కొనుగోలు చేసిన వారు వెనక్కు వెళ్తే, తాము సినిమాను వదలుకుంటామని అంటున్నారని నిర్మాత రాజేష్ చెబుతున్నారు.

మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంతా కలిసి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.



Source link

Related posts

క‌మ్మోళ్ల‌కు దేబ‌రింపు క‌ర్మేంటి?

Oknews

గెలుపా? కులమా? ఏది ముఖ్యం!

Oknews

తెలంగాణ కాంగ్రెస్‌కు సీనియర్ల గండం!

Oknews

Leave a Comment