Andhra Pradesh

YS Sharmila Comments : జగన్ అన్న వల్లే మా కుటుంబం చీలిపోయింది


వారికోసం నిస్వార్థంగా పని చేశా – షర్మిల

“జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందిలో ఉంటే.. 18 మంది రాజీనామాలు చేసి జగన్ ఆన్న గారి వైపు నిలబడ్డారు. అధికారంలో వచ్చాకా మంత్రులను చేస్తా అన్నారు. ఇవాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు…? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ,నేను వాళ్ళ కోసం తిరిగాం. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని,పిల్లలకు పక్కన పెట్టీ…ఎండనక,వాన అనక రోడ్ల మీదనే ఉన్నాను. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశా. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా,స్వలాభం చూడకుండా,నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగా. దేశంలోనే మిస్ట్ సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేశా. మిమ్మల్ని గెలిపించా. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు వేరే మనిషిలా మారిపోయారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు ..YSR పేరు,ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నాను. YSR పేరు నిలబెడతాడు అనుకున్నా. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు” అని వైఎస్ షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు.



Source link

Related posts

AP High Court on Group1: ఏపీపీఎస్సీ గ్రూప్‌1 రద్దుపై డివిజన్‌ బెంచ్‌లో ఊరట… సింగల్ బెంచ్‌ ఉత్తర్వులపై స్టే

Oknews

Chandrababu Health : చంద్రబాబు ఆరోగ్యం బాగుంది… దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు

Oknews

IIIT Student Suicide: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్ధి ఆత్మహత్య

Oknews

Leave a Comment