Health Care

సక్సెస్ స్టోరీస్ చదివితే.. నిజంగానే సక్సెస్ అవుతామా?


దిశ, ఫీచర్స్ : జీవితంలో సక్సెస్ కావాలని అందరూ అనుకుంటారు. కానీ కొందరు మాత్రమే వారు కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. ఎందులోనైనా సరే విజయం పొందాలంటే ముందుగా కావాల్సింది ధృడ సంకల్పం. ఈ పనిని నేను చేయగలుగుతాను అని గట్టిగా నమ్మాలి, అలాగే ప్రయత్నం చేయాలి. అలా అయితేనే వారు విజయాన్ని చేరుకుంటారు.

అయితే ఈ సక్సెస్ కోసం చేసే పోరాంటం. ఒకొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. కొందరు ప్రణాళికలు రూపొందించుకొని గమ్యం వైపు అడుగులేస్తే, మరికొందరు సక్సెస్ స్టోరీస్, మోటివేషనల్ వీడియోస్ చూస్తూ విజయానికి బాటలు వేసుకుంటారు.

మరి నిజంగానే సక్సెస్ స్టోరీస్ చదివితే సక్సెస్ అవుతామా? ఈ ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అసలు విషయం‌లోకి వెళ్లితే.. మోటివేషనల్ కొటేషన్స్ అయినా, సక్సెస్ స్టోరీస్ అయినా, సక్సెస్ ఇస్తాయని క్లారిటీగా చెప్పలేం కానీ, అవి వారి ఎదుగుదలకు, సాధనకు దోహదపడతాయని అంటున్నారు నిపుణులు. వారు ఒక గొప్ప పుస్తకం చదివి, అందులో మంచి, చెడు, ఫెయిల్యూర్,సక్సెస్ ఇలా చాలా విషయాలను నేర్చుకుంటారు. వాటిని సరిగ్గా ఉపయోగించుకొని, గొప్ప వారి ఆలోచనలను, ఆచరణలు అలవాట్లుగా మార్చుకొని తమ లక్ష్యాన్ని సాధించవచ్చునంట. అంతే కాకుండా వారు ఎంచుకున్న లక్ష్యం పనిచేస్తున్న రంగానికి సంబంధిచినదై ఉంటే త్వరగా సక్సెస్ సాధించవచ్చు.



Source link

Related posts

Happy Fathers Day : నాన్న.. ఈ టెస్ట్ చేయించుకో..

Oknews

పాము పడగలో నిజంగానే నాగమణి ఉంటుందా?

Oknews

మానవ మూత్రంతో కంటి జబ్బులకు చికిత్స..!?

Oknews

Leave a Comment