కళల విభాగంలో చూస్తే…. జానకీలాల్ (రాజస్థాన్), గోపీనాథ్ స్వైన్ (ఒడిశా), స్మృతి రేఖ ఛక్మా – త్రిపుర, ఓంప్రకాశ్ శర్మ – మధ్యప్రదేశ్,భద్రప్పన్ – తమిళనాడు,రతన్ కహార్ – పశ్చిమ బెంగాల్, నారాయణన్ – కేరళ, భాగబత్ పదాన్ – ఒడిశా, జోర్డాన్ లేప్చా – సిక్కిం, మచిహన్ సాసా – మణిపుర్, బాలకృష్ణన్ సాధనమ్ పుథియ వీతిల్ – కేరళ, శాంతిదేవీ పాసవాన్, శివన్ పాసవాన్ – బిహార్, అశోక్ కుమార్ బిశ్వాస్ – బిహార్, బాబూ రామ్‌యాదవ్ – ఉత్తర్‌ప్రదేశ్. నేపాల్ చంద్ర సూత్రధార్ – (పశ్చిమ బెంగాల్)ను పద్మ శ్రీ అవార్డులు వరించాయి. క్రీడా విభాగంలో మహాారాష్ట్రకు చెందిన ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండేకు పద్మ శ్రీ అవార్డను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వైద్య విభాగంలో…. హేమచంద్ మాంఝీ – ఛత్తీస్‌గఢ్,ప్రేమ ధన్‌రాజ్ – కర్ణాటక, యజ్దీ మాణెక్ షా( గుజరాత్)కు అవార్డు దక్కింది. ఈ ఏడాదికిగాను మొత్తం 110 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. గత ఏడాది(2013)లో చూస్తే…. 6 మందికి పద్మ విభూషణ్ (Padma Vibhushan), 9 మందికి పద్మ భూషణ్, 91 మందికి పద్మ శ్రీ పురస్కారం అందజేసింది కేంద్రప్రభుత్వం.