దిశ, ఫీచర్స్: చలి కాలం వచ్చిందంటే చాలు చాలా మందికి కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతుంటాయి. కూర్చోలేరు నించోలేరు అనే పరిస్థితి ఎదురవుతోంది. అయితే.. ఈ బాధ ఓన్లీ చలి కాలం లోనే అనుకుంటే అది మీ పొరపాటే. కొంతమందికి ఎప్పుడు పడితే అప్పుడు కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతుంటాయి. దీనికి గల అసలైన కారణం బాడీలో విటమిన్ బి12 లోపంగా చెబుతున్నారు వైద్యులు.
అయితే దీని తీవ్రత పెరిగే కొద్ది కాళ్ల నొప్పులు వస్తాయట. ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ బి12 లోపంతో ఇబ్బంది పడుతున్నారు. బి12 అనేది మన శరీరంలో సాధారణంగానే వృద్ధి చెందే విటమిన్. ఇది శరీరంలో తగ్గుతున్నప్పుడు కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. అయితే ఎటువంటి మందులు లేకుండా విటమిన్ బి12 ను వృద్ధి చేసుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* పాలు, పెరుగు లేదా పులిసిన మజ్జిగలో ఎక్కువగా బి12 ఉంటుంది.
* మాంసాహారం తీసుకోవడం వల్ల కూడా విటమిన్ బి12 వృద్ధి చెందుతుంది.
* చేపలు, గుడ్లలో కూడా బి12 పుష్కలంగా ఉంటుంది.
* ముఖ్యంగా ఆకుకూరలు, పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల ఈ లోపాన్ని అధిగమించవచ్చు.
* పిస్తా, బాదం వంటి డ్రై ఫ్రూట్స్లలో కూడా అధికంగా ఉంటుంది.
వీటితో పాటుగా రోజు వాటర్ ఎక్కువగా తాగినట్లు అయితే.. విటమిన్ బి12 వృద్ధి చెందడమే కాకుండా శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా రక్షించవచ్చు.