Sports

Kohli Wins ICC Men’s ODI Cricketer Of The Year Award For Fourth Time


kohli wins ODI cricketer of the Year Award: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ రికార్డు స్థాయిలో నాలుగోసారి ఐసీసీ వన్డే ఉత్తమ క్రికెటర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. 2023లో  వివిధ ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు ఐసీసీ అవార్డులను ప్రకటించింది. విరాట్‌ 2012, 2017, 2018లోనూ ఈ పురస్కారం దక్కించుకోగా, ప్రపంచ క్రికెట్‌లో నాలుగుసార్లు బెస్ట్‌ వన్డే ప్లేయర్‌గా నిలిచిన ఏకైక ఆటగాడయ్యాడు. 2023లో విరాట్‌ 24 వన్డేల్లో 72.47 సగటుతో ఆరు శతకాలు, ఎనిమిది హాఫ్‌ సెంచరీలతో 1377 పరుగులు పూర్తి చేశాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో 11 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 765 పరుగులు చేశాడు.

పది ఐసీసీ అవార్డులు

 

విరాట్ కోహ్లీ ఖాతాలో ఐసీసీ అవార్డుల సంఖ్య 10కి చేరింది. 10 ఐసీసీ అవార్డులు అందుకున్న తొలి ప్లేయర్‌గా కోహ్లీ మరో రికార్డు అందుకున్నాడు. అత్యధిక ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితాలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర (4), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (4) ఉన్నారు. ఐదు బీసీసీఐ అవార్డులు గెలుచుకున్న కోహ్లీ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్స్‌ను మూడుసార్లు సొంతం చేసుకున్నాడు. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌ కూడా అందించిన ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ను ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు వరించింది. ఉత్తమ టెస్టు ఆటగాడిగా ఉస్మాన్‌ ఖవాజా (ఆసీస్‌) నిలిచాడు. మహిళల్లో ఉత్తమ క్రికెటర్‌గా నాట్‌ సివర్‌ బ్రంట్‌ (ఇంగ్లండ్‌), వన్డే బెస్ట్‌ ప్లేయర్‌గా చమరి ఆటపట్టు (శ్రీలంక) అవార్డులను అందుకోనున్నారు. 

 

2023లో టాప్‌ 2లో కోహ్లీ

 

2023లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లీ 2,048 పరుగులతో రెండో స్థానం (ఫస్ట్‌ ప్లేస్‌లో గిల్‌  2,154) లో ఉన్నాడు. ఇందులో ఏడు సెంచరీలు (ఐదు వన్డే శతకాలు) ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌ – నవంబర్‌లో భారత్‌ వేదికగానే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ.. తన విశ్వరూపం చూపాడు. వన్డే వరల్డ్‌ కప్‌లోనే సచిన్‌ 49 సెంచరీ(వన్డేలలో) ల రికార్డును చెరిపేసి 50వ శతకం కూడా పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 53.25 సగటుతో 639 రన్స్‌ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్థ శతకాలున్నాయి. వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా సచిన్‌ సెంచరీల రికార్డును బ్రేక్‌ చేసినప్పుడు వికిపీడియాలో కోహ్లీ గురించి ఎక్కువమంది సెర్చ్‌ చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. డిసెంబర్‌ నెలకు గానూ ప్రముఖ మ్యాగజైన్ ఔట్‌లుక్ బిజినెస్ రూపొందించిన ఛేంజర్ మేకర్స్-2023 జాబితాలో విరాట్‌ కోహ్లీకి చోటు దక్కింది. భారత్‌లో అత్యంత ప్రభావవంతంగా మార్పు తీసుకురాగల వ్యక్తులతో ఔట్‌ లుక్‌ బిజెనెస్‌ ఈ జాబితా రూపొందించగా అందులో కోహ్లీకి స్థానం దక్కింది. 

 

ఎన్నో రికార్డులు 

 

పదిహేనేళ్ల కెరియర్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. మరెన్నో రివార్డులను అందుకున్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు మొత్తం 50 సెంచరీలు చేసి.. లెజెండరీ క్రికెటర్ సచిన్‌ ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ రికార్డును అధిగమించాడు. తన సుదీర్ఘ ఇంటర్నేషనల్ కెరియర్‌‌‌‌‌‌‌‌లో 80 సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక శతకం చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. కోహ్లీ క్రికెట్ జర్నీలో ఎన్నో మైలు రాళ్లు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎదురుదెబ్బలు తిన్నా ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపరుచుకుంటూ ఉన్నత స్థానంలో ఉంటున్నాడు. 2023లో కోహ్లి అంతర్జాతీయ పరుగులు 1500 దాటాయి. ఏడు సెంచరీలు చేశాడు. ప్రపంచకప్ కంటే ముందు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో అద్భుత శతకంతో అభిమానులను ఉర్రూతలూగించాడు. భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో తనదైన ఆటతో అదరగొడుతున్నాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో దాదాపు 90 సగటుతో 713కిపైగా పరుగులు సాధించాడు. అందులో మూడు శతకాలతో పాటు నాలుగు అర్ధసెంచరీలున్నాయి.

 



Source link

Related posts

Laxman Sivaramakrishnan Slams Ravichandran Ashwin Again On Social Media

Oknews

PAK Vs SA Live Score World Cup 2023 Babar Azam Wins Toss Pakistan Bat First

Oknews

LSG vs DC Match Highlights | లక్నో పై ఆరువికెట్ల తేడాతో ఢిల్లీ జయకేతనం | IPL 2024 | ABP Desam

Oknews

Leave a Comment