Health Care

జ్ఞాపకశక్తిని పెంచుతున్న హ్యాండ్ రైటింగ్..టైపింగ్‌కంటే ఎఫెక్టివ్‌గా..


దిశ, ఫీచర్స్ :  కీబోర్డ్‌పై టైప్ చేయడంకంటే నోట్‌బుక్‌లోనో, డిజిటల్ టాబ్లెట్‌పైనో చేతితో రాయడంవల్ల నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. స్టడీలో భాగంగా నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు 36 మంది స్టూడెంట్స్‌ను అబ్జర్వ్ చేశారు. స్క్రీన్‌పై డిస్‌ప్లే చేయబడిన పదాలు రాయడాన్ని, ఆ తర్వాత వాటినే టైప్ చేయడాన్ని పరిశీలించారు. కాగా పార్టిసిపెంట్స్ టచ్‌స్క్రీన్‌పై కర్సివ్‌లో రాయడానికి డిజిటల్ పెన్ను ఉపయోగించారు. టైప్ చేయడానికి కీబోర్డ్‌ను ఉపయోగించారు.

పరిశోధకులు డిజిటల్ పెన్నుతో రాస్తున్నప్పుడు, కీ బోర్డుపై ఒక వేలితో టైప్ చేస్తున్నప్పుడు సదరు పార్టిసిపెంట్స్ బ్రెయిన్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీస్‌ను కొలిచారు. ఇందుకోసం పరిశోధకులు 256 సెన్సార్లతో కూడిన ఒక స్పెషల్ క్యాప్‌ను యూజ్ చేశారు. దీనిని అధిక సాంద్రత కలిగిన EEG అని పిలుస్తారు. ఈ క్యాప్‌ను ధరించడంవల్ల రాయడానికి లేదా టైప్ చేయడానికి ప్రాంప్ట్ చేయబడిన ప్రతిసారీ పార్టిసిపెంట్స్ బ్రెయిన్ యాక్టివిటీస్ ఐదు సెకన్ల పాటు రికార్డ్ చేయబడ్డాయి. కాగా ఈ రెండు సందర్భాలను ఎనలైజ్ చేసిన రీసెర్చర్స్ హ్యాండ్ రైటింగ్ అద్భుతంగా వివిధ మెదడు ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచిందని, బ్రెయిన్ కార్యకలాపాలను గణనీయంగా మెరుగుపరిచిందని కనుగొన్నారు. టైపింగ్ కూడా మంచిదే అయినప్పటికీ, హ్యాండ్ రైటింగ్‌తో పోల్చినప్పుడు నేర్చుకునే సామర్థ్యంలో కాస్త నెమ్మదిస్తుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.



Source link

Related posts

దెయ్యాల ఆవాసంగా భాంగర్ కోట.. సాధువు, తాంత్రికుడు ఎవరి శాపం కారణం..

Oknews

Cocaine Sharks : గంజాయి తింటున్న సొర చేపలు.. డ్రగ్ ఎక్కడ తీసుకుంటున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Oknews

ఏసీ ఉపయోగించిన కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వాల్సిందే..!

Oknews

Leave a Comment