EntertainmentLatest News

‘లిటిల్ మిస్ నైనా’ మూవీ రివ్యూ


మూవీ : లిటిల్ మిస్ నైనా

నటీనటులు: గౌరీ జి కిషన్, షేర్షా షరీఫ్ తదితరులు

సినిమాటోగ్రఫీ : ల్యూక్ జోస్

మ్యూజిక్: గోవింద్ వసంత

ఎడిటింగ్: సంగీత్ ప్రతాప్

నిర్మాతలు: సృజన్ వై, సాధిక్ షేక్

దర్శకత్వం:  విష్ణు దేవ్

ఓటీటీ : ఈటీవి విన్

హీరోకి ఓసీడీతో మహానుభావుడు సినిమా చూసాం.. ఇప్పుడు అదే తరహాలో నైనా అనే అమ్మాయికి ఓసీడీ.. మరి తాజాగా ఈటీవి విన్ లో విడుదలైన ‘ మిస్ నైనా ‘ మూవీ కథేంటో చూసేద్దాం… 

కథ:- 

అభిజిత్ చంద్రదాస్ సినిమా కథలను రాయాలని ఓ స్క్రిప్ట్ రాస్తుంటాడు. అలా తను రాస్తున్నప్పుడు సడన్ గా కథలోకి నైనా అనే పేరు వస్తుంది. ‌నేనెందుకు నైనా పేరు చెప్పానంటు అభిజిత్ తన గతంలోకి వెళ్తాడు. గతంలో అభిజిత్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు తన జూనియర్ గా నైనా పరిచయం అవుతుంది. సీనియర్స్ నైనాని ర్యాగింగ్ చేస్తుండగా అభిజిత్ ని పిలిచి.. నైనా నుదుటిపై ఉన్న బొట్టుని అభిజిత్ నుదిటికి పెట్టాలని సీనియర్స్ చెప్పగా.. అభిజిత్ నైనా అంటే ఇష్టం ఏర్పడి తనని ఎత్తుకొని బొట్టు పెట్టేలా చేస్తాడు. ఆ తర్వాత నైనా వెనుకాల అభిజిత్ తిరుగుతుంటాడు.‌ ఇక కొన్నిరోజులకి ఇద్దరు ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి నైనాకి వేరే అతడితో పెళ్ళి ఫిక్స్ అవుతుంది.. అసలు నైనా, అభిజిత్ ల మధ్య లవ్ స్టోరీ ఏంటి? ఎందుకు నైనా వేరే అతడిని పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయిందనేది మిగతా కథ…

విశ్లేషణ:- 

పొట్టిగా ఉన్న యువతి నైనా రాథర్, పొడవైన వ్యక్తి అభిజిత్ చంద్రదాస్ ల మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది? ప్రేమలో వీళ్ళ మధ్య ఏర్పడిన సమస్యలని చూపించడంలో విష్ణు దేవ్ సక్సెస్ అయ్యాడు. అయితే ఈ లవ్ డ్రామాని రెండు గంటలు చూపించడంతో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి ప్రేమకథలు బోల్డెన్ని వచ్చాయి. ఓ సమస్యని తీసుకొని ప్రేమకి అది పెద్ద సమస్యే కాదని నిరుపిస్తూ.. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు మూవీలు చూసాం.. అదే విధంగా ఇప్పుడు ‘లిటిల్ మిస్ నైనా’ ని మేకర్స్ తెలుగు ప్రేక్షకుల మీదకి వదిలారు. 

ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అదే లవ్ లో హగ్ , రొమాన్స్ అవీ ఉంటాయి. అవి స్కిప్ చేస్తే చూసేయొచ్చు. అసలు తీసుకుంది డిఫరెంట్ కాన్సెప్ట్ దాన్ని వదిలేసి ఒక రెగ్యులర్ లవ్ స్టోరీలా తీసారు. ఇక ఈ లవ్ స్టోరీ చూపించడం కోసం ఇద్దరి మధ్య హైట్ ప్రాబ్లమ్ అనే కాన్సెప్ట్ ఎందుకో  అర్థం కాదు. బోరింగ్ అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగుతుంది. రెండు గంటల నిడివి గల ఈ సినిమాని స్కిప్ చేయకుండా చూడటం కష్టమే. సినిమా మొత్తంలో ఈ కాన్సెప్ట్ పైన ఒకే ఒక్క సింగిల్ షాట్ ఉంటుంది‌. ఆ తర్వాత అంతా మనం ఇప్పటికే చూసిన చాలా ప్రేమకథలు గుర్తొస్తాయి.‌ అన్నీ రిపీటెడ్ సీన్స్ లా అనిపిస్తున్నాయి. ఇదే కథ ఓ పది సంవత్సరాల క్రితం వస్తే కాస్త హిట్ అయ్యేదేమో కానీ ఇప్పుడు మాత్రం తేలిపోయింది.

ట్రైలర్ చూసి మంచి ఫీల్ గుడ్ మూవీ అని చూడాలనుకుంటే కష్టమే. దానికి ఈ సినిమా కథకి సంబంధం లేదా అన్నట్టు సాగుతుంది‌. నెమ్మదిగా సాగే కథనం ఓ వైపు, ఇప్పటికే అరిగిపోయిన క్యాసెట్ లాగా అదే ప్రేమకథని రుద్ది రుద్ది సాగదీసినట్టుగా ఉంటుంది. పాటలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. సరైన క్లైమాక్స్ ఇవ్వలేదు. అడ్డదిడ్డంగా సాగే సీన్ల మధ్యలో అసలు కథ మిస్ అయింది. మంచి ప్రేమకథ అని చూడాలనుకునేవారికి ఓ హర్రర్ లా అనిపిస్తుంది. ల్యూక్ జోస్ సినిమాటోగ్రఫీ బాగుంది‌. సంగీత్ ప్రతాప్ ఎడిటింగ్ లో కాస్త శ్రద్ధ చూపిస్తే బాగుండు. గోవింద్ వసంత అందించిన మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:-

నైనా పాత్రలో గౌరీ జి కిషన్ ఆకట్టుకుంది. అభిజిత్ చంద్రదాస్ గా షేర్షా షరీఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.  ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

ఫైనల్‌గా…

ఒక రొటీన్ ప్రేమ కథని అంతే రొటీన్ గా మలిచి ‘ లిటిల్ మిస్ నైనా’ గా చూపించారు. ఇది చూడాలంటే లిటిల్ బిట్ ఓపిక కూడా కావాలి.

రేటింగ్ :  2.25 / 5

✍️. దాసరి  మల్లేశ్



Source link

Related posts

Sharmila.. why so much worry? షర్మిల.. ఎందుకింత ఆందోళన?

Oknews

ప్రభాస్ పై మహేష్ బాబు అధికార వ్యాఖ్యలు 

Oknews

టిల్లు స్క్వేర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంతే.. గోల గోల చేస్తున్నారుగా

Oknews

Leave a Comment