Entertainment

పవర్‌స్టార్‌ సినిమాను ఓటీటీ నుంచి తొలగించిన అమెజాన్‌ ప్రైమ్‌!


ప్రస్తుతం థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్న విషయం తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు పోటీ పడి మరీ విభిన్నమైన సినిమాలను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ సినిమాను తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించింది అమెజాన్‌ ప్రైమ్‌. వివరాల్లోకి వెళితే… 

కరోనా టైమ్‌లో అందర్నీ కలచివేసిన వార్త కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం. కన్నడలో టాప్‌స్టార్‌ వెలుగొందిన పునీత్‌ని అతి చిన్న వయసులోనే మృత్యువు కబళించింది. ఈ వార్త విని కన్నడిగులే కాదు.. దక్షిణాది మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఎంతో అభిమానుల్ని సొంతం చేసుకున్న పునీత్‌ చేసిన సేవా కార్యక్రమాలు వింటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే అతనంటే అంత అభిమానించేవారు. తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అయితే.. కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌ పవర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఎంతో అలవోకగా, డూప్‌ లేకుండా చేయడం ఆయన స్పెషాలిటీ. ఆయన చనిపోక ముందు కొన్ని సినిమాల్లో నటించారు. అవి ఆయన మరణం తర్వాత విడుదలయ్యాయి. లక్కీ మ్యాన్‌, గంధడగుడి, జేమ్స్‌ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. 

పునీత్‌ నటించిన చివరి చిత్రం ‘గంధడ గుడి’. డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రేటింగ్‌ వచ్చింది. ఈ డాక్యుమెంటరీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకుంది. ఇప్పుడీ సినిమాను అమెజాన్‌ తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించింది. టైటిల్‌ లైసెన్స్‌ గడువు ముగిసిన కారణంగానే దాన్ని తొలగించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ గూగుల్‌ టీవీ, ఐ ట్యూన్‌, యాపిల్‌ టీవీ, యూట్యూబ్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇది ఉచితంగా లభించదు. రూ.100 చెల్లించి ఈ డాక్యుమెంటరీని వీక్షించవచ్చు. 98 నిమిషాల ఈ డాక్యుమెంటరీని కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీలో పునీత్‌ నటించడమే కాకుండా స్వయంగా నిర్మించారు కూడా. 

 



Source link

Related posts

ఓటీటీలోకి 'భగవంత్ కేసరి'.. ఎప్పుడు? ఎక్కడ?

Oknews

నాక్కూడా తెలీకుండా నా పెళ్ళి చేసేస్తున్నారు : మంగ్లీ

Oknews

లావ‌ణ్య బ్యాచిల‌ర్ పార్టీ.. ఫొటోలు వైర‌ల్

Oknews

Leave a Comment