EntertainmentLatest News

ఓవర్ సీస్ లో ఎన్టీఆర్ దేవర రికార్డు బిజినెస్


తెలుగు సినిమా పరిశ్రమలో అమరత్వం ఉండే నటుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr) కూడా ఒకడు.అమరత్వం అంటే సినిమా చూసాక కూడా కొన్ని రోజుల పాటు ఆ హీరో నటన గురించి మాట్లాడుకోవడం. ఈ విషయంలో ఎన్టీఆర్ కొంచం ముందు వరుసలోనే ఉంటాడు. గత సంవత్సరం వచ్చిన ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ దేవర (devara) అనే చిత్రంలో నటిస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా దేవర కి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది.

దేవర కి సంబంధించిన అన్ని ఏరియాల బిసినెస్ స్టార్ట్ అయ్యిందనే వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ మేరకు దేవర ఓవర్ సీస్ బిజినెస్  27 కోట్లకి క్లోజ్ అయ్యిందని అంటున్నారు. రీజినల్ సినిమా స్థాయిలో చూసుకుంటే గత తెలుగు సినిమాలు కన్నా ఆ ఫిగర్ హయ్యెస్ట్ అని చెప్పవచ్చు.ఇప్పుడు ఈ వార్తలతో  ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్  దృష్ట్యా అంత పెద్ద మొత్తం  ఓవర్ సీస్ లో రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి .అలాగే నైజాం బిజినెస్ సుమారు 45 నుంచి 50 కోట్లు దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ అండ్ దిల్ రాజు దేవర 

హక్కుల కోసం పోటీపడుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే మరికొన్ని రోజుల్లో దేవర ఆల్ ఏరియాస్ లో జరుపుకునే బిజినెస్ మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది 

కొరటాల శివ (koratala siva) దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర మీద ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. సుమారు 200 కోట్ల రూపాయిల వ్యయంతో నిర్యాణం జరుపుకుంటున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్  యువ సుధా ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని  సుధాకర్,హరికృష్ణలు నిర్మిస్తున్నారు.ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ పోషిస్తున్నాడు.

 

 



Source link

Related posts

నార్కోటిక్ పోలీసుల విచారణలో హీరో నవదీప్

Oknews

అటు చెల్లి.. ఇటు కేంద్రం.. కష్టాల్లో జగనన్న..

Oknews

వాటి గురించి నేను చూసుకుంటా.. సాయి ధరమ్ తేజ్‌కి పవన్ కళ్యాణ్ వార్నింగ్!

Oknews

Leave a Comment