పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్..రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక నామినేటెడ్ పదవులను ఎంజాయ్ చేస్తున్న నేతలు ఒక్కొక్కరుగా పదవీచ్చితులు అవుతున్న పరిస్థితితో ఖమ్మంలో గులాబీ గూడు చెదిరిపోతోంది. ఇప్పటికే రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ తో పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సుడా చైర్మన్ పదవులను ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే డీసీఎంఎస్ చైర్మన్ పై సైతం అనర్హత వేటు వేయగా డీసీసీబీ చైర్మన్ కూడా బల నిరూపణలో ఓడిపోయి పదవిని కోల్పోతున్నారు. ఇక కొత్తగూడెం, ఇల్లందు కార్పొరేషన్లలోనూ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే జిల్లా కేంద్రంలోని ఖమ్మం కార్పొరేషన్ లోనూ పాగా వేసేందుకు కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. ఇలా వరుస పరిణామాల నేపధ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ చెల్లాచెదరు అవుతోంది.
Source link
previous post