రోజు రోజుకి జగనన్న బాణం తిరిగి తిరిగి జగన్ కే గుచ్చుకుంటుంది. ఏపీలో 2019 ఎన్నికల ముందు జగన్ కోసం పాదయాత్ర చేసిన షర్మిలని జగన్ అధికారంలోకి రాగానే పక్కనబెట్టేశారు. తల్లిని చెల్లిని పట్టించుకోకపోవడంతో షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి పార్టీ పెట్టి హడావిడి చేసి చివరికి ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా అడుగుపెట్టింది మొదలు ఆమె జగన్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడింది. రోజు రోజుకి జగన్ ని గుక్కతిప్పుకోనివ్వకుండా ఇచ్చిపడేస్తుంది.. తాజాగా మరోసారి షర్మిల జగన్ పై వైస్సార్ పార్టీపై విరుచుకుపడింది.
ఇప్పుడున్నది YSR కాంగ్రెస్ పార్టీ కాదు
Y అంటే YV సుబ్బారెడ్డి
S అంటే సాయిరెడ్డి
R అంటే రామకృష్ణా రెడ్డి
మీ పార్టీలో YSR లేడు
మీది జగన్ రెడ్డి పార్టీ..నియంత పార్టీ…ప్రజలను పట్టించుకోని పార్టీ
ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ
వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ
– నా పై ముప్పేట దాడి చేస్తున్నారు
– అన్నివైపుల నుంచి దాడి చేస్తున్నారు
– నా సొంత వాళ్ళు అనుకొని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశ
– నా బిడ్డలను ఇంటిని పక్కన పెట్టా
– వైసీపీ నీ నా బుజాల మీద వేసుకున్న
– మనసు పెట్టీ పని చేశా
– నా రక్తం దారపోశా..నా చెమటను దారపోశా
– అదే వైసీపీ ఇప్పుడు నా మీద దాడి చేస్తుంది
– నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేసిన నేను భయపడ
– ఇక్కడున్నది వైఎస్సార్ బిడ్డ
– భయపడే వాళ్ళు ఎవరు లేరు
– మీకు చేతనయ్యింది చేసుకోండి..
– నేను రెడీ…ఈ యుద్ధానికి మేము రెడీ
– ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలి
– ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలి
– విశాఖ స్టీల్ ఉండాలి. ఉద్యోగాలు రావాలి
– రైతు రాజ్యం రావాలి
– అందుకే వైఎస్సార్ బిడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది అంటూ YS షర్మిల ఆవేశంగా మాట్లాడింది.