Latest NewsTelangana

Appointment Of Conveners For Seven Common Entrance Tests In Telangana


Telangana CETS Conveners: తెలంగాణలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పలు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(CET)లకు కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి నియమించింది. ఆయా సెట్లను నిర్వహించే వర్సిటీల వివరాలనూ వెల్లడించింది. టీఎస్​ఈఏపీసెట్, పీజీఈసెట్‌లను జేఎన్టీయూహెచ్‌కు, ఐసెట్ కాకతీయకు, ఈసెట్, లాసెట్‌లను ఉస్మానియాకు, ఎడ్‌సెట్ మహాత్మాగాంధీ వర్సిటీకి, పీఈసెట్‌ను శాతవాహన వర్సిటీకి కేటాయించింది. ఈఏపీసెట్ కన్వీనర్​గా ప్రొఫెసర్ దీన్ కుమార్​ను, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్​ను ఈసెట్ కన్వీనర్​గా, ఓయూ లీగల్ సెల్ డైరెక్టర్​ విజయలక్ష్మిని లాసెట్ కన్వీనర్​గా నియమించారు. పీజీఈసెట్ కన్వీనర్ గా అరుణ కుమారి, ఐసెట్ కన్వీనర్‌గా నరసింహాచారి. పీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ మృణాళిని నియమితులయ్యారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..  మే 6 ఈసెట్, మే 9 నుంచి 13 వరకు ఈఏపీసెట్ (ఎంసెట్) పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 23న ఎడ్‌సెట్, జూన్ 3న లాసెట్, జూన్ 4,5 తేదీల్లో ఐసెట్, జూన్ 6 నుంచి 8 వరకు పీజీఈసెట్, జూన్ 10 నుంచి 13 వరకు పీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారు.

తెలంగాణ సెట్ కన్వీనర్లు వీరే..











సెట్ పేరు నిర్వహణ యూనివర్సిటీ కన్వీనర్
టీఎస్ ఎప్‌సెట్(ఈఏపీసెట్)  జేఎన్టీయూహెచ్‌ ప్రొఫెసర్ దీన్ కుమార్​ 
టీఎస్ ఈసెట్  ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్​
టీఎస్ లాసెట్/పీజీఎల్‌సెట్ ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ లీగల్ సెల్ డైరెక్టర్​ విజయలక్ష్మి
టీఎస్ పీజీఈసెట్ జేఎన్టీయూహెచ్‌ అరుణ కుమారి
టీఎస్ ఐసెట్  కాకతీయ యూనివర్సిటీ నరసింహాచారి 
టీఎస్ పీఈసెట్ శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ 
టీఎస్ ఎడ్‌సెట్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మృణాళిని

పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ మే 9 నుంచి 11 వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ ప‌రీక్ష నిర్వహించున్నారు. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో టీఎస్ ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. 

➥ టీఎస్ ఈసెట్ ప్రవేశ ప‌రీక్షను మే 6న నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జ‌ర‌గ‌నుంది. 

➥ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష మే 23న జ‌ర‌గ‌నుంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించ‌నుంది. 

➥ రాష్ట్రంలోని లా కాలేజీల్లో 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘టీఎస్ లా సెట్ 2024 పరీక్షను జూన్ 3న నిర్వహించ‌నున్నారు. అదే విధంగా పీజీ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్టును కూడా అదేరోజు నిర్వహించ‌నున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌ల‌ను ఉస్మానియా యూనివ‌ర్సిటీ నిర్వహించ‌నుంది.

➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ‘టీఎస్ ఐసెట్’ ప్రవేశ పరీక్షను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించ‌నున్నారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జర‌గ‌నుంది. 

➥ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించ‌నున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ పరీక్ష నిర్వహించనుంది.

➥ బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించే ‘టీఎస్ పీఈసెట్’ ప‌రీక్షను జూన్ 10 నుంచి 13 మ‌ధ్య నిర్వహించ‌నున్నారు. శాతవాహ‌న యూనివ‌ర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Related posts

YS Jagan Follows KCR కేసీఆర్ బాటలోనే జగన్.. 3 నెలలే?

Oknews

Megastar big donation for Janasena జనసేనకు చిరు భారీ విరాళం..!

Oknews

12 సినిమాలు 2024 ఆస్కార్ కి..తెలుగు నుంచి స్టార్ హీరో మూవీ నామినేట్

Oknews

Leave a Comment