సినిమా పేరు: ఫైట్ క్లబ్
నటీనటులు: విజయ్ కుమార్, మోనిషా మోహన్ మీనన్ తదితరులు…
రచన : శశి
ఎడిటింగ్: పి. కృపాకరన్
సినిమాటోగ్రఫీ: లియోన్ బిట్టో
మ్యూజిక్: గోవింద్ వసంత
నిర్మాతలు: లోకేష్ కనకరాజ్, ఆదిత్య
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అబ్బాస్ కె. రహమత్
ఓటీటీ: ఆహా
ఇతర భాషలలో రిలీజైన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ అవుతున్నాయి. అలా తాజాగా ఆహాలో ‘ఫైట్ క్లబ్’ అనే మూవీ రిలీజైంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం…
కథ:
తమిళనాడులోని ఓ ప్రాంతంలో నిరంతరం గ్యాంగ్ వార్స్ జరుగుతుంటాయి. కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తుండగా ఓ రౌడీ మూక కాలేజీలోకి చొరబడి స్టూడెంట్స్ ని నరికేయడంతో కథ మొదలవుతుంది. ఇక కథ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళుతుంది. సెల్వ(విజయ్ కుమార్) ఓ ఏరియాలో ఉంటాడు. సెల్వ వాళ్ళ అమ్మ రకరకాల వంటలు చేస్తూ అక్కడ హ్యాపీగా ఉంటుంది. కానీ తనకి ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లమ్ ఆమె భర్త.. అతను రోజంతా కష్టపడి వచ్చిన డబ్బులన్నింటిని తాగడానికి ఖర్చు చేసి రోడ్డు మీద తాగిపడిపోతుంటాడు. ఇక సెల్వ కి చిన్నప్పటి నుండి ఫుట్ బాల్ అండ్ బాక్సింగ్ అంటే ఇష్టం ఉంటుంది. అదే ఏరియాలో ఓ గ్యాంగ్ లీడర్ లా, కోచ్ లా బెంజమీన్ ఉంటాడు. బెంజమీన్ అలియాస్ బెంజీ ఒకప్పుడు బాక్సింగ్ ఛాంపియన్ కానీ తను ఉండే ఏరియాలోని యూత్ ని కొట్లాట, గొడవల వైపు వెళ్ళకుండా బాక్సింగ్, ఫుట్ బాల్ ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఓరోజు సెల్వని చూసి అతడికి బాక్సింగ్ ట్రైనింగ్ ఇచ్చి చాంపియన్ చేయాలని అనుకుంటాడు. అదే విషయాన్ని సెల్వ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగగా.. తను ఒప్పుకోడు, డబ్బులు కూడా ఇవ్వడు. దాంతో సెల్వకి అతడి నాన్నకి గొడవ జరుగుతుంది. మరి సెల్వ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడా? బెంజీ ఆ ఏరియాలోని యూత్ ని మార్చాడా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే…
విశ్లేషణ:
తమిళనాడులోని ఓ ప్రాంతంలో కొట్లాట, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి అక్కడ యూత్ పాడవుతుంటే ఓ ఫుట్ బాల్ కోచ్ వారిని మారుద్దామని అనుకుంటాడు. ఇదే కథ. దీనిని పూర్తిగా తమిళ్ నేటివిటికి అనుగుణంగా మార్చడంతో ఆ ఫ్లేవర్ ఎక్కువగా కన్పిస్తుంది. మరి ఈ కథతో తెలుగు ప్రేక్షకులని మెప్పించాడా అంటే లేదనే చెప్పాలి.
ఓ ఏరియాలోని యూత్ ని మార్చడానికి కోచ్ పడే కష్టాలు, వారి కుటుంబాలని ఒప్పించే సీన్లు కొన్ని బాగానే ఉన్నప్పటికీ.. యూత్ డ్రగ్స్ తీసుకుంటూ, క్రైమ్స్ చేయడం ఓ ఫ్యాషన్ అన్నట్టుగా అది ఇక్కడ చాలా సాధారణం అన్నట్టుగా తీసారు డైరెక్టర్ రహమత్. సినిమా కథ ఓల్డ్ మూవీలన్నింటిలోని క్రైమ్ థ్రిల్లర్స్ ని ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసి బయటకు తీసినట్టుగా ఉంది.
రీసెంట్ గా రిలీజైన అథర్వ, లేబుల్ వెబ్ సిరీస్ ల ఛాయలు బాగా కన్పిస్తాయి. స్క్రీన్ మీద లోకేష్ కనకరాజు అనే పేరు చూసి ఈ సినిమా చూడాలనుకుంటే పప్పులో కాలేసినట్టే.. అతను కేవలం నిర్మాతగా చేశాడంతే.. కథ ఒకరు.. దర్శకత్వం ఒకరు.. నిర్మాత ఒకరు.
సెల్వని ఎలాగైన బాక్సింగ్ క్లబ్ లో జాయిన్ చేయాలని చూసే కోచ్ బెంజమీన్ ని కూడా చంపేస్తారు. గొడవలు వద్దు క్రైమ్స్ వద్దని చూసే పెద్దాయననే చంపేయడంతో ఆ క్రైమ్స్ మరింతగా పెరుగుతాయి. యూత్ అంతా కత్తులతో చంపుకొని, డ్రగ్స్ తీసుకొని పాడైపోయి, మందు గంజాయి తాగి చెడిపోవడమే ఫ్యాషన్ అనే రేంజ్ లో సినిమాని తీసారు. పైగా ఈ సినిమాని పలు భాషల్లో డబ్ చేస్తున్నారంటే దర్శక,నిర్మాతలది ఎంత ధైర్యమో. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. కానీ కత్తిపోట్లు, రక్తపు బొట్లు, చెమట చుక్కలు చాలానే ఉంటాయి.
యూత్ ని ఆకర్షించే విధంగా తీయాలనుకొని, వారి చెడుని చూసి నేర్చుకోండి అంటు ఓ పేలవమైన మెసెజ్ ఇచ్చారు మేకర్స్. ఈ వీకెండ్ లో ఈ మూవీని చూడకపోవడమే బెటర్. ఎందుకంటే ఇదే కథని మన తెలుగులోనే ఎన్నో సినిమాలుగా ఇప్పటికే మనం చూసాం.. గోవింద్ వసంత అందించిన బిజిఎమ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పి. కృపాకరన్ ఎడిటింగ్ పర్వాలేదు. లియోన్ బొట్టో సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
సెల్వగా విజయ్ కుమార్ ఆకట్టున్నాడు. బెంజమీన్ గా కార్తికేయన్ సంతానం ఒదిగిపోయాడు. శైలుగా మోనిషా మోహన్ మీనన్ పర్వాలేదు. జోసెఫ్ గా అవినాష్ రఘదేవన్ సపోర్ట్ ఇచ్చాడు. శంకర్ థాస్ గా కృప పర్వాలేదనిపించాడు. ఇక మిగిలివారు వారి పరిధి మేరకు నటించి మెప్పించారు.
తెలుగవన్ పర్ స్పెక్టివ్:
సాదా సీదాగా సాగే రివెంజ్ డ్రామా ఇది. మర్డర్ అండ్ క్రైమ్స్ సీన్స్ ని ఇష్టపడేవారు మాత్రమే ఒక్కసారి చూసేయొచ్చు. మిగిలివ వారు ఇది చూడకపోవడమే బెటర్.
రేటింగ్ : 2/5
✍️. దాసరి మల్లేశ్