Health Care

జీవితంలో మంచి గురువును ఎలా ఎంచుకోవాలి..!!


దిశ, ఫీచర్స్: తల్లిదండ్రుల తర్వాత మనం ఎక్కువగా గౌరవించేది గురువునే. పేరేంట్స్ కన్నా పాఠశాలలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతాం. గురువు ఎప్పుడు సద్గుణాలతో నిండి ఉంటాడు. అతనికి దురాశ, అసూయ, అహంకారం, వ్యామోహం వంటి దుర్గుణాలు ఉండవు. ఎప్పుడైతే గురువు దురాచారాలకు దూరంగా ఉంటాడో.. అప్పుడు శిష్యులను దుర్గుణాల నుంచి దూరంగా ఉండగలుగుతాడు.

గురువు లేకపోతే విద్యార్థులు గొప్ప స్థాయికి వెళ్లలేరు. మనకంటూ ఒక లక్ష్యం అనేది ఉండదు. కాగా జీవితం గురించి ఎంతో చక్కగా వివరించే చాణక్య చెప్పినట్లు చేయడం వల్ల లైఫ్‌లో మంచి విజయాలను సాధించవచ్చు. చాణక్య నీతి గురించి వినే ఉంటారు. కాగా మనం ఎలాంటి గురువును ఎంచుకోవాలో చాణక్య వెల్లడించారు. జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఏలాంటి గురువును ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా గురువు అంటే తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని విద్యార్థులకు చేరవేయడం. తనకు తెలిసిన విషయాలనే కాకుండా కొత్తవి నేర్చుకుని మరీ నేర్పించడం. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని తెప్పించడం. చదువుపై దృష్టి పెట్టేలా చేయడం. వారికంటూ ఒక గోల్‌ను ఏర్పరచడం. ఇలాంటి గురువుతో ఎక్కువ స్నేహం చేసి.. అతడి దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుంటే మీరు గొప్ప స్థాయిలో ఉంటారు. అలాగే క్రమశిక్షణ కలిగి ఉన్న గురువును ఎంచుకోవాలి. ఒక గురువుకు విద్యార్థుల పట్ల అసూయ ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా విద్యార్థుల ఎదుగుదలను మాత్రమే కోరుకోవాలి. ఇలాంటి గురువు ఉంటే విద్యార్థులు పై స్థాయికి వెళ్తారు. కాగా ఈ లక్షణాలున్న ఉపాధ్యాయుడు మీ లైఫ్‌లో ఉంటే చిరాకు పడకుండా తమ దగ్గర నుంచి ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపండి.



Source link

Related posts

మేకప్ లేని మోడల్ బామ్మ.. ఈ వయస్సులో కూడా ర్యాంప్‌ వాక్..

Oknews

మొదటి సారి నెలసరి వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే

Oknews

ఏలకులతో మెరిసే ముఖం.. ఎలాగో చూడండి..

Oknews

Leave a Comment