ByMohan
Mon 29th Jan 2024 02:24 PM
సంక్రాంతికి చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన హను-మాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందనను రాబట్టుకుని పెద్ద స్థాయి చిత్రంగా బాక్సాఫీస్ వద్ద సంచనాలను క్రియేట్ చేస్తోంది. సినిమా విడుదలై రెండు వారాలు అవుతున్నా.. ఇంకా థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే.. అది ఒక్క హనుమాన్‌కే సాధ్యమైంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రానికి లిమిటెడ్ థియేటర్లే లభించడంతో.. ప్రేక్షకులు చాలా మంది ఈ సినిమాని చూడలేకపోయారు. వారంతా ఇప్పుడు థియేటర్ల బాట పట్టడంతో.. హను-మాన్ కలెక్షన్స్ ఇంకా స్టడీగానే ఉన్నాయి. థియేటర్లలో కాకుండా ఈ సినిమాని ఓటీటీలో చూద్దాంలే అనుకునేవారు మాత్రం ఇంకా నెలకు పైనే వెయిట్ చేయాలి.
ఎందుకంటే ఈ సినిమా ఓటీటీలోకి మార్చి రెండో వారంలో రానుందని తెలుస్తోంది. జీ 5 ఓటీటీ సంస్థ హను-మాన్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి సెకండ్ వీక్‌లో హను-మాన్‌ను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తెచ్చేందుకు జీ5 సంస్థ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. సో.. ఓటీటీలో ఈ సినిమాని చూడాలనుకునే వారు.. ఇంకా 40 నుండి 45 రోజుల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వచ్చినా.. బ్రహ్మాండమైన ఆదరణను అందుకోవడం మాత్రం కాయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఇందులో ఉంది మరి.
హను-మాన్ విషయానికి వస్తే.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి చిత్రమిది. యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 250 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు ఉన్న లిస్ట్‌లో టాప్ 5 స్థానాన్ని సొంతం చేసుకుని.. ఇంకా భారీగానే కలెక్షన్స్‌ని రాబడుతోంది.
Hanu-Man OTT Release Details:
March 2nd Week Hanuman on ZEE5